Advertisementt

లోకల్‌ వర్సెస్‌ నాన్‌లోకల్‌...!

Tue 31st Jan 2017 08:46 PM
nenu local movie,nani,nagarjuna,suriya,s3,om namo venkatesaya  లోకల్‌ వర్సెస్‌ నాన్‌లోకల్‌...!
లోకల్‌ వర్సెస్‌ నాన్‌లోకల్‌...!
Advertisement
Ads by CJ

నేడు ప్రతి భాషలోనూ ఆయా భాషా చిత్రాలకు ధీటుగా డబ్బింగ్‌ చిత్రాలు, ఇతర భాషల చిత్రాలు కూడా పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఏ చిత్రాలు బాగుంటే ఆ చిత్రాలనే ఆదరిస్తూ.. తమ అభిరుచిని చాటుకుంటున్నారు. కాగా ఫిబ్రవరి3వ తేదీన దిల్‌రాజు-నానిల కాంబినేషన్‌లో విడుదలకు సిద్దమవుతున్న 'నేను..లోకల్‌' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. నాని, కీర్తిసురేష్‌ వంటి వారికి ఉన్న క్రేజ్‌తో పాటు నిర్మాతగా దిల్‌రాజు టేస్ట్‌పై, జడ్జిమెంట్‌పై ఉన్న నమ్మకం కూడా ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌ అవుతోంది. అదేరోజున మోహన్‌లాల్‌ నటించిన 'కనుపాప' అనే డబ్బింగ్‌ చిత్రం కూడా విడుదలవుతోంది. పేరుకు డబ్బింగ్‌ చిత్రమే అయినా ప్రస్తుతం మోహన్‌లాల్‌కు తెలుగులో ఉన్న క్రేజ్‌ ఈ చిత్రానికి స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలవనుంది.

ఇక ఈ చిత్రం మలయాళంలో 'ఒప్పం' పేరుతో సంచలన విజయం సాధించింది. పూర్తి వైవిధ్యమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కావడం, హీరోగా మోహన్‌లాల్‌ అంధుని పాత్రలో అద్బుతంగా నటించిన ఈ చిత్రంపై కూడా కొంతమందికి మంచి ఇంట్రస్ట్‌ ఉంది. ఇక ఈ చిత్రాన్ని గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన 'పసివాడి ప్రాణం' చిత్రంతో నిర్మాతలు పోలుస్తున్నారు. ఓ అంధుడే హీరో అయి, ఓ చిన్నారిని కాపాడటం కోసం పడే తపన ఎలా ఉంటుందనే విషయాన్ని ఎంతో అద్భుతంగా ఈ చిత్రంలో తెరకెక్కించామంటున్నారు. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇక ఫిబ్రవరి 9వ తేదీన సూర్య-హరిల కాంబినేషన్‌లో రూపొందిన భారీ యాక్షన్‌ చిత్రం 'ఎస్‌3' పలు వాయిదాల అనంతరం విడుదలకు సిద్దమవుతోంది. 'సింగం' సిరీస్‌ కావడం, పవర్‌ఫుల్‌ యాక్షన్‌ పోలీస్‌ స్టోరీగా రూపొందడం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ, సూర్య కెరీర్‌లోనే కాదు.. రజనీ తర్వాత ఆ స్థాయిలో తమ చిత్రానికి విడుదలకు ముందే 100కోట్ల బిజినెస్‌ జరిగిందని ఈ చిత్ర నిర్మాతలు పబ్లిసిటీ చేస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుండగా, ఆ పక్కరోజే కింగ్‌ నాగార్జున నటించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం కూడా విడుదలకు సిద్దమవుతుండటంతో వచ్చే వారం కూడా టాలీవుడ్‌లో రసవత్తర పోటీకి రంగం సిద్దమైంది. మరి ఈ లోకల్‌ వర్సెస్‌ నాన్‌లోకల్‌ పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారో వేచిచూడాల్సివుంది. కాగా కొందరు మాత్రం కర్ణాటకలలోగానే తెలుగులో కూడా బయటి భాషాచిత్రాల డబ్బింగ్‌లను ఆపాలనే తరహా వ్యాఖ్యలను మరలా తెరపైకి తెస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ