Advertisementt

చైతు సంతోషానికి హద్దులు లేవ్...!

Tue 31st Jan 2017 06:21 PM
naga chaitanya,nagarjuna,lakshmi,daggubati families,rana,venkatesh,akhil  చైతు సంతోషానికి హద్దులు లేవ్...!
చైతు సంతోషానికి హద్దులు లేవ్...!
Advertisement
Ads by CJ

అక్కినేని వారసుడు నాగ చైతన్య నిశ్చితార్ధం సమంతతో ఈ ఆదివారం చాలా ఘనంగా హైదరాబాద్ లో జరిగిపోయింది. ఈ వేడుకలో సమంత ప్రత్యకమైన ఆకర్షణగా నిలిచింది. సమంత, నాగ చైతన్య మీద ప్రేమతో చైతూని కలిసినప్పటినుండి నేటి వరకు తమ మధ్యన జరిగిన ముఖ్యమైన సందర్భాలను తన చీర అంచు మీద బంగారువర్ణంతో డిజైన్ చేయించుకుంది. ఇక నాగ చైతన్య, సమంత వెలికి ఉంగరం తొడిగి గాఢమైన ముద్దుతో తన ప్రేమను తెలియజేశాడు. ఇక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి నాగార్జున, అమల, అఖిల్ తన ఫియాన్సీ శ్రియ భూపాల్ తో హాజరయ్యారు. ఇక నాగ చైతన్య మేనమామలు దగ్గుబాటి సురేష్, వెంకటేష్ లు ఫ్యామిలీ తో పాటు ఈ నిశ్చితార్ధానికి హాజరు కాగా నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా ఈ ఎంగేజ్మెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

నాగ చైతన్య తల్లి లక్ష్మి నాగార్జున కి మొదటి భార్య అలాగే వెంకటేష్, సురేష్ బాబులకు స్వయానా చెల్లెలు. కొన్ని కారణాల వల్ల లక్ష్మి, నాగార్జునతో విడిపోయి చెన్నై లో ఒంటరిగా జీవిస్తోంది. ఇక కన్న కొడుకు నిశ్చితార్ధానికి ఆమె రావడంతో నాగ చైతన్య సంతోషంతో ఉప్పొంగిపోయాడనే విషయంపై ఫోటో చూస్తే అర్ధమవుతుది. నాగ చైతన్య తన తల్లితో ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఈ ఫోటోని చూస్తే తెలుస్తుంది. ఇక నాగార్జునతో విడిపోయాక నాగ చైతన్య తల్లి లక్ష్మి ఎవరికీ పెద్దగా కనబడకుండా అజ్ఞాతంలోనే ఉండిపోయింది. ఇక కొడుకు నాగ చైతన్య, సమంతని పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టమేనని ఎప్పుడో చెప్పింది. ఇంకా చైతు - సామ్ ల నిశ్చితార్ధానికి దగ్గుబాటి ఫ్యామిలీ మెంబెర్స్ మొత్తం హాజరయ్యారని సమాచారం. ఇక రానా దగ్గుబాటి తన బావ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ కి హాజరై సమంతకి చైతన్య కి శుభాకాంక్షలు తెలియజేశాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ