రాజకీయవేత్త, పారిశ్రామిక వేత్త అయిన సుబ్బారామి రెడ్డి ఏదైనా సరే అంతా స్పెషల్ గా ఉండాలనుకుంటారు. తనకి నచ్చిన పని దేన్నైనా... ఎంత ఖర్చైనా పెట్టి చేసేస్తుంటాడు. సినిమా వాళ్ళకి అవార్డులివ్వడం దగ్గర నుండి ఏదైనా సరే. అది టాలీవుడ్, బాలీవుడ్ ఏ ఇండస్ట్రీని వదలడు. అలాంటి సుబ్బిరామిరెడ్డి తాజాగా కూతురు పింకీ కొడుకు కేశవ్ పెళ్లిని హైదరాబాద్ లో చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా నిర్వహించాడు. ఇక ఈ పెళ్లి వేడుకకి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీస్ మాత్రమే కాకుండా రాజకీయనాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ దగ్గర్నుండి... కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.... టాలీవుడ్ టాప్ స్టార్స్ బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి దిగ్గజ స్టార్స్ అంతా ఈ వేడుకకి హాజరయ్యారు. ఆ పెళ్లి వేడుకలో వీరంతా ఒక్కచోట కలిసే సరికి దేవతలంతా దివి నుండి భువికి దిగి వచ్చారా... అనే ఫీలింగ్ కలిగింది అందరికి.
ఇకపోతే ఈ పెళ్ళికి సంబందించిన సంగీత్ వేడుకలో మెగా స్టార్ చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి, బాలీవుడ్ స్టార్ రణ్వీర్లు చిరు లేటెస్ట్ మూవీ ఖైదీ నెంబర్ 150 చిత్రంలోని అమ్మడు లెట్స్ కుమ్ముడు సాంగ్ కి వేసిన స్టెప్స్ చూస్తుంటే ఆ వేడుకకి వేసిన స్టేజ్ అదిరిపోయిందంటే నమ్మండి. మరి చిరు వంటి టాప్ స్టార్ సుబ్బిరామిరెడ్డి తో కలిసి డాన్స్ అంటే అది చూసే వాళ్లకి రెండు కళ్ళు చాలవు అన్నట్టు వుంది. ఇంకా సంగీత్ లో జీవీకే రెడ్డి, పెళ్ళికొడుకు కేశవ్, పెళ్లికూతురు వీణ కూడా కొన్ని అదిరిపోయే సాంగ్స్ కి స్టెప్స్ వేశారు. ఇక వీరందరిలో మెగా స్టార్ చిరు, సుబ్బిరామి రెడ్డి వేసిన స్టెప్స్ మాత్రంఅదుర్స్ అనిపించాయని అంటున్నారు.
ఇక కేశవ్ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహన్ ఫ్యామిలీ, బాలకృష్ణ ఫ్యామిలీ, చిరంజీవి, నాగార్జున ఫ్యామిలీ, అఖిల్, రజినీకాంత్, అమితాబచ్చన్ ఫ్యామిలీ వంటి పెద్దలు పాల్గొన్నారు.