Advertisementt

ఎంతైనా నాని మాట తీరే వేరబ్బా..!

Tue 31st Jan 2017 03:21 PM
tollywood,gero nani,new directors,nani gives chance to new heroines,new directors  ఎంతైనా నాని మాట తీరే వేరబ్బా..!
ఎంతైనా నాని మాట తీరే వేరబ్బా..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ స్టార్ హీరో నానిని నమ్ముకుంటే ఎవరికైనా మంచి జరుగుతుంది అది అంతే అనేది టాలీవుడ్ లో ప్రముఖంగా వినిపిస్తున్న మాట. అందుకే ముఖ్యంగా నిర్మాతలు నాని వెంట పడుతూ ఉంటారు. నానితో సినిమా చేస్తే ఎలాంటి సమస్య ఉండదు, పైగా వసూళ్ళ గ‌ల‌గ‌లలు కూడా బాగానే ఉంటాయని వారి నమ్మకం. అందుకే నాని సినిమా అంటే చాలు బాక్సాఫీసు గురించి ఎవరూ ఆలోచించరు. అక్కడ తప్పకుండా పండగ వాతావ‌ర‌ణమే అని అందరికీ తెలుసు. అందుకే నాని ఎప్పుడూ స్టార్ ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేయాలని ఆరాట పడడు. తాను సినిమా చేసి ఆ దర్శకుడినే స్టార్ డైరెక్టర్ చేద్దామన్న ఆలోచనలోనే ఉంటాడు. అలాగే స్టార్ హీరోయిన్లతోనే నటించాలని వేచి చూడడు. తాను నటించేది కొత్త హీరోయిన్ తోనే అయినా ఆ సినిమా విడుదల అయ్యాక తన సినిమా ద్వారా ఆ నాయిక స్టార్ హీరోయిన్ కావాలని కోరుకుంటాడు.

సహజంగా నాని కొత్త వాళ్ళతోటే ఎప్పుడూ సినిమా చేయాలని తహ తహలాడుతుంటాడు కూడా. అందులో భాగంగానే నాని వీలైనంతవరకు తన సినిమాల ద్వారా కొత్త కొత్త నాయికలను పరిచయం చేయాలని చూస్తుంటాడు. ఆ తర్వాత తన సినిమా ద్వారా ఆ క‌థానాయిక‌లు స్టార్లుగా మారిపోతుంటారు. సహజంగా నానిని ఈ విషయంపై అడిగితే... మీరెందుకు ఎప్పుడూ స్టార్ హీరోయిన్లతో నటించరు? అంటే.. వాళ్ళతో నటించాలని వేచి చూస్తే మన జీవితం సంవత్సరానికి ఒక్క సినిమాకే అంకితం అవుతుంది. వాళ్ళ కాల్షీట్లు మామూలుగా అందవు కదా అంటాడు హీరో నాని. స్టార్ హీరోయిన్ల‌తో పెట్టుకొంటే.. త‌న సినిమాలు లేట‌వ్వ‌డం ఖాయ‌మ‌ని దాని అంతరార్ధం. తాను సహజంగా సంవత్సరానికి నాలుగు సినిమాలు చేస్తుంటాను... అందుకు అనుగుణంగా మూడు నెల‌ల‌కు ఒక సినిమా పూర్తి అయ్యి తీరాలి. ఈ సినిమాకి పలానా స్టార్ క‌థానాయికే కావాల‌ని కూర్చుంటే కాల్షీట్ల ఇబ్బంది వచ్చిపడి ఆ సినిమాను సకాలంలో పూర్తి చేయలేం కదా అన్నాడు నాని. ఇంకా తాను స్పందిస్తూ.. అదే కొత్త నాయికను పరిచయం చేస్తే.. భ‌విష్య‌త్తులో వాళ్లు స్టార్స్ అయిపోతే.. దానిలో తన ప్ర‌మేయం కూడా ఉంటుంది కదా అంటూ అసలు రహస్యం చెప్పేసి మురిసిపోయాడు నాని. ఇంకా దర్శకుల గురించి మాట్లాడుతూ.. తాను కొత్త దర్శకులతో కాదు, భవిష్యత్తులో స్టార్ డైరెక్టర్స్ కాబోయే వారితో పని చేస్తున్నానంటూ వివరించాడు హీరో నాని.       

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ