మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత తీరిగ్గా రీఎంట్రీ ఇచ్చినా కూడా తనలోని స్టామినా ఏమాత్రం తగ్గలేదని 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ఘన విజయంతో ఋజువు చేస్తూ బాక్స్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని కొల్లగొడుతుంటే మెగా ఫ్యామిలీ మెంబెర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే 'ఖైదీ...' చిత్రానికి మెగా హీరో రామ్ చరణ్ నిర్మాత. ఇక లాభాల పంటను ఆనందం గా అనుభవిస్తున్నాడు. చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీ కూడా ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఆ మెగా ఫ్యామిలీ అని చెప్పుకునే ఒకరిలో కొంచెం బాధ కనిపిస్తుందట. చిరు రీఎంట్రీ ని తక్కువగా అంచనా వేసిన ఆయన రీఎంట్రీ చిత్రం ఘన విజయం సాధించడంతో దెబ్బతిన్నాడట.
ఆయనెవరో మీకు ఈపాటికే అర్ధమై ఉంటుంది. చిరంజీవి సినిమాల్లో కెరీర్ స్టార్ట్ చేసినప్పటినుండి వెన్నుదన్నుగా నిలిచిన అల్లు అరవింద్... చిరు రీఎంట్రీ ని తక్కువగా అంచనా వేసాడని చెబుతున్నారు. తొమ్మిదేళ్ల తర్వాత చిరు లో గ్రెస్ తగ్గి అనుకున్నంత విజయాన్ని సాధించకపోవచ్చని అనుకున్నాడట. కానీ అల్లు అరవింద్ అంచనాలను తల్లకిందులు చేస్తూ 'ఖైదీ...' చిత్రం సూపర్ హిట్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించడంతో ఇప్పుడు ఖంగు తిన్నాడని అంటున్నారు. 'ఖైదీ...' చిత్రం 100 కోట్ల క్లబ్ లో చేరి డిస్ట్రిబ్యూటర్స్ కి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది.
ఇక రామ్ చరణ్ కి కూడా మంచి లాభాలు రావడంతో తన తండ్రి 151 వ చిత్రాన్ని కూడా నిర్మించాలని డిసైడ్ అయిపోయాడు. మరి ఒకసారి లాభాలు రుచి చూసాక మళ్ళీ అలాంటి లాభాలనే కోరుకోవడంలో తప్పులేదుగా... ఇక అల్లు అరవింద్ 150 వ చిత్రంలో అంచనాలు తల్లకిందులయ్యే సరికి ఈసారి 151 వ చిత్రాన్నైనా నిర్మిద్దామని ఆశపడేసరికి మళ్ళీ రామ్ చరణ్ నేనే నిర్మాత అనేసరికి గుండెల్లో రాయి పడిన ఫీలింగ్ లో అరవింద్ కి వచ్చిందని అంటున్నారు. మరి బావ కష్ట సుఖాల్లో ఎప్పుడూ అండగా వుండే అరవింద్ ఇంత చిన్న విషయంలో బాధ పడడం కరెక్ట్ కాదేమో!