Advertisementt

ఘనంగా సమంత- చైతూ నిశ్చితార్ధం..!

Mon 30th Jan 2017 02:13 PM
samantha,naga chaitanya,engagement,hyderababd,nagarjuna,amala,akhil,shreyabhupal  ఘనంగా సమంత- చైతూ నిశ్చితార్ధం..!
ఘనంగా సమంత- చైతూ నిశ్చితార్ధం..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ యువ హీరో యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య అందాల ముద్దుగుమ్మ సమంత‌ల నిశ్చితార్థం ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ లోని ఎన్‌ క‌న్వెన్ష‌న్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. మొదట నాగచైతన్య సమంతకు ఉంగరం తొడిగి మురిసిపోగా తర్వాత సమంత తన మానస చోరుడైన నాగచైతన్యకు ఉంగరం తొడిగి సిగ్గులొలికించింది. చైతన్య, సమంతకి  ఒక అందమైన ముద్దు ఇచ్చి తన సంతోషాన్ని పంచుకున్నాడు. వీరి నిశ్చితార్ధం వేడుక అక్కినేని వారి కుటుంబ సభ్యులు, కొంతమంది బంధుమిత్రుల ఆధ్వర్యంలో క‌న్నుల‌పండువ‌గా జరిగింది. ఈ వేడుకలో అక్కినేని నాగార్జున‌, అమ‌ల దంప‌తులు, అఖిల్‌ శ్రేయాభూపాల్ కొత్త జోడీ ద‌గ్గ‌రుండి ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వ‌హించారు. అయితే ఈ నిశ్చితార్ధపు కార్యక్రమంలో నాగ‌చైత‌న్య సూటు, బూటుతో స్మార్ట్‌గా క‌నిపిస్తే, బంగారం, తెలుపు వర్ణం క‌ల‌గ‌లిసి ధ‌గ‌ధ‌గ‌లాడే చీర‌లో స‌మంత మెరిసిపోయింది.

అయితే చాలా కాలంగా నాగ చైతన్య, సమంతలు ప్రెండ్స్ గా గడిపి ఆ తర్వాత లవర్స్ గా మారిన విషయం తెలిసిందే. వీరి లవ్ స్టోరీ విషయానికి సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకంటే వీరిద్దరూ భిన్న మతస్తులు కావడంతో వీరికి మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పవచ్చు. నాగ చైతన్య పక్కా హిందూ సాంప్రదాయపు విలువలు కలిగిన వ్యక్తి కాగా, సమంత మాత్రం క్రిస్టియానిటీని నమ్మిన నాయికామణి. వీరి నమ్మకాలకు అనుగుణంగానే వీరి నిశ్చితార్ధాన్ని కూడా ఇటు హిందూ సంప్రదాయంలోనూ, అటు క్రైస్తవ పద్ధతులతోనూ రెండు రకాలుగా నిర్వహించడం విశేషంగా చెప్పవచ్చు. 

కాగా వివాహం కూడా ఈ రెండు పద్ధతులలో జరగనుందనే టాక్ ఇప్పటికే నడుస్తుంది. మొదట చెన్నైలో క్రిస్టియన్ పద్ధతి ప్రకారం వివాహం జరుపుకొని, ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకోనున్నట్లు మీడియాలో టాక్ నడుస్తుంది. ఇలా రెండు రకాలుగా వారి వారి పద్ధతులలో జరిపే ఈ వివాహానికి మొత్తం జనాలను, ప్రముఖులను ఆహ్వానించక పోయినా ఆ తర్వాత రెండింటికి కలిపి ఇచ్చే రిసెప్షన్ కు మాత్రం అందరినీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది.

ఇక నాగార్జున వీరిద్దరి నిశితార్ధమవ్వగానే తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. 'ఇప్పుడు అధికారికంగా మా అమ్మే... నా కూతురయ్యిందని... ఇంతకుమించిన ఆనందం ఏముంటుందని' మనం సినిమా డైలాగ్ స్టయిల్లో చెప్పాడు.  ఇక అక్కినేని వారింట అఖిల్, నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలై పోయినట్టే. ఇప్పటికే అఖిల్, శ్రియ భూపాల్ ని ఎంగేజ్మెంట్ చేసుకుని ఇటలీలో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక నాగ చైతన్య కూడా సమంతతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఒకే ఏడాదిలో అన్నదమ్ములిద్దరూ ఒక ఇంటివారు కాబోతుండడంతో నాగార్జున దంపతులు ఆనందానికి అవధుల్లేకుండా పోయానని సమాచారం. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ