Advertisementt

ఐటెం పాపగా ఇచ్చిన నాకు ఓకే...!

Sun 29th Jan 2017 07:38 PM
kajal,chiranjeevi,khaidi no 150 movie,janatha gyarage movie,item girl chance,ntr  ఐటెం పాపగా ఇచ్చిన నాకు ఓకే...!
ఐటెం పాపగా ఇచ్చిన నాకు ఓకే...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో అందరి స్టార్ హీరోలతో నటించిన కాజల్ కి ఆ మధ్యన ఆఫర్స్ ఒక్కసారిగా తగ్గిపోయాయి. కాజల్ చివరిగా నటించిన పెద్ద సినిమాలు రెండు డిజాస్టర్ అయ్యేసరికి కాజల్ కి ఆఫర్స్ రావడం పూర్తిగా తగ్గాయి. 'సర్దార్, బ్రహ్మోత్సవం'  రెండు పెద్ద సినిమాలు వరసబెట్టి ప్లాప్ అవడంతో టాలీవుడ్ లో కాజల్ కి కష్టాలు మొదలయ్యాయి. అయితే 'జనతా గ్యారేజ్' లో కాజల్ కి ఐటెం సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. ముందు ఒప్పుకోకుండా బెట్టు చేసినప్పటికీ తర్వాత పారితోషకం గట్టిగా ముట్టజెప్పరేమో ఆ ఐటెంలో డాన్స్ చేసి సూపర్ అనిపించింది.

ఇక వెంటనే మెగా స్టార్ చిరంజీవి పక్కన కాజల్ కి 'ఖైదీ నెంబర్ 150' లో ఛాన్స్ రావడంతో మళ్లీ కాజల్ కెరీర్ గాడిన పడి స్టార్స్ పక్కన అవకాశం వస్తుంది అనుకున్నారంతా. కానీ 'ఖైదీ...' సినిమా హిట్ అయ్యి క్రెడిట్ చిరు ఖాతాలోకి వెళ్లడంతో కాజల్ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చేసింది. ఇక దానితో కాజల్ చేసేది లేక మంచి సినిమాల్లో ఐటెం పాపగా అవకాశం వస్తే చేస్తానని సన్నిహితులకు చెబుతుందట. ఇక పెద్ద సినిమాల్లో ఆఫర్స్ గనక రాకపోతే చిన్న సినిమాల్లో కూడా ఐటెం గర్ల్ గా నటించేందుకు కాజల్ ఒప్పుకునేలా ఉందని గుసగుసలు వినబడుతున్నాయి. అంటే కాస్త ఛాన్స్ లు వచ్చినప్పుడే అందినంతా మూటగట్టుకుని సెటిల్ అవ్వాలనే ఆలోచనకి కాజల్ వచ్చినట్టు లేదూ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ