అన్ని భాషల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుని ఇప్పటికి అందాల తారగానే వెలుగొందుతూ అతిలోక సుందరి అనిపించుంటున్న శ్రీదేవి తన కూతుర్లకు అందంలో గట్టి పోటీనిస్తుంది. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ, ఖుషి లు తన తల్లి అందాలను పుణికిపుచ్చుకుని సినిమాల్లో ఒక వెలుగు వెలగడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పెద్ద కూతురు జాన్వీ అయితే ఇదిగో.. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అదిగో.... సినిమాల్లోకి వస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్నప్పటికీ అది ఇంతవకు జరగలేదు. అసలు సినిమాల్లోకి రావడం సంగతి అటుంచి జాన్వీ మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని రోజుకో రకంగా సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తుంది.
మరి సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇప్పించడానికి శ్రీదేవి తహ తహ లాడుతుంటే జాన్వీ ఏమో బాయ్ ఫ్రెండ్ తో చెక్కర్లు కొడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఇక శ్రీదేవి ఫ్యామిలీ మాత్రం ఎక్కడికి వెళ్లినా ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాను క్లిక్ మనిపించేస్తుంటారు. ఇప్పుడు అలాగే ఈ ముగ్గురు ముంబై ఎయిర్ పోర్ట్ లో తళ తళ మెరుస్తూ ఫోటో గ్రాఫర్స్ కి చిక్కారు. జాన్వీ, ఖుషి లు మోడరన్ డ్రెస్ లతో మత్తెక్కిస్తుండగా శ్రీదేవి మాత్రం మాములు డ్రెస్ లో కూతుళ్ళకి మాత్రం ఇప్పటికి గట్టి పోటీ ఇవ్వగలనే రీతిలో కనబడింది. పై ఫోటో చూసిన ఎవ్వరైనా అవునని అనాల్సిందే.