భారత ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రతిపక్షాలపైనే కాకుండా అక్రమ సంపాదనపరులందరిపై కూడా విరుచుకు పడ్డాడు. ఈ సందర్భంగా మోడి మాట్లాడుతూ.. పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత అవినీతి పరుల నుండి తనకు బెదిరింపులు చాలానే వచ్చాయని, మూడు నెలలుగా అటువంటి బెదిరింపులు వస్తూనే ఉన్నాయని ఆయన వెల్లడించాడు. అంతే కాకుండా ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘నా పేరు మోడీ, ఎవరితోనైనా ఢీకి రెడీ, తాను ఎవరి బెదిరింపులకు లొంగని వాడను’ అని మోడి వివరించాడు. అక్రమ సంపాదన చేస్తూ.. భారీగా ధనాన్ని పోగు చేసుకున్న వారంతా తాను తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారని ఆయన అన్నాడు. అందుకే ఇటువంటి దాడికి దిగుతున్నారని మోడీ అన్నాడు. తాను రాజకీయాలకు అతీతంగా అవినీతిపై పోరాటం చేస్తున్నానని మోడీ స్పష్టం చేశాడు.
ఇంకా మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కూడా విరుచుకు పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక వంటిదని, అందులో మీరు ఎక్కితే మునిగి పోవడం ఖాయమని ఆయన అన్నాడు. కాంగ్రెస్ పార్టీని మాత్రం ఏమాత్రం నమ్మ వద్దని ఆయన ప్రజలకు తెలిపాడు. వృథాగా పాకిస్థాన్ కు వెళ్తున్న సింధు జలాలను పంజాబ్ రాష్ట్రానికి రప్పిస్తామని మోడీ హామీ ఇచ్చాడు. ఇంకా పంజాబ్ ధైర్య సాహసాలకు పుట్టిల్లు అనీ, ఎందరో యోగులకు, త్యాగశీలురకు పంజాబ్ నిలయం అని, రాహుల్ గాంధీ వంటి వ్యక్తులు పంజాబ్ యువత ప్రతిష్ఠతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మోడీ ఆరోపించాడు.