Advertisementt

పవన్‌..జర జాగ్రత్త...హైజాక్‌ చేస్తున్నారు!

Sun 29th Jan 2017 12:35 PM
pawan kalyan,janasena,south india,aatmagourava sabha,vizag  పవన్‌..జర జాగ్రత్త...హైజాక్‌ చేస్తున్నారు!
పవన్‌..జర జాగ్రత్త...హైజాక్‌ చేస్తున్నారు!
Advertisement
Ads by CJ

తమిళనాడు ప్రజలు తమ రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని చూసిన బిజెపికి, మోడీకి జల్లికట్టు ఉద్యమం ద్వారా తిరుగులేని షాక్‌ ఇచ్చారు. నిజానికి పరిశీలిస్తే జల్లికట్టు ఉద్యమానికి అండగా నిలిచిన మెరీనా బీచ్‌ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొన్నది యువత. అందులోనూ పెద్దగా తమ సంప్రదాయాల గురించి, జల్లికట్టుతో ప్రత్యక్ష సంబంధం లేని పట్టణ, నగర, మహానగరాలకు చెందిన అర్బన్‌ యువత ఎక్కువ. కానీ వారు తమకు సంబంధం లేని జల్లికట్టుకు తీవ్రనిరసన చెప్పడం చాలా లోతైన విషయం. ఇక సినిమా నటులకు కూడా జల్లికట్టుతో పెద్దగా సంబంధం లేదు. వారు కూడా రంగంలోకి దిగడానికి కారణం ఉంది. ఇక మోదీకి ఆప్తుడైన రజనీ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. తనకు మంచి మంచి పదవులు ఇస్తామని, బిజెపిలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తామని చెప్పిన మోదీకి రజనీ ఎంతో గౌరవం ఇస్తాడు. కానీ తన స్వార్థం కోసం కాకుండా తమిళ ప్రజలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్న ఉత్తరాది పార్టీలు, మరీ ముఖ్యంగా జాతీయ పార్టీలుగా చెప్పుకునే బిజెపి, కాంగ్రెస్‌లను కూడా ఆయన తృణప్రాయంగా భావించాడు. ఇక ఇదే ఉద్యమ స్ఫూర్తితో కర్ణాటకలో సైతం కంబళ పోటీలపై ఉద్యమం మొదలైంది. 

మరోపక్క అదే స్ఫూర్తితో ఏపీలో ప్రత్యేకహోదా ఉద్యమం ఊపందుకుంది. తమిళనాడులో జల్లికట్టుకు అక్కడి ప్రభుత్వం కూడా తలవంచిన కారణంగానే ఇది సాధ్యమైంది. కానీ ఏపీలో మాత్రం టిడిపి, వైసీపీలు ఇప్పటికీ ఈ విషయాన్ని రాజకీయం చేస్తూనే ఉన్నాయి. యువత పిలుపుకు మొదటగా స్పందించిన పవన్‌ నుండి ఆర్కేబీచ్‌ ఉద్యమాన్ని జగన్‌ హైజాక్‌ చేయడంతో పాటు అందులో చాలాశాతం సఫలీకృతుడు కూడా అయ్యాడు. కాగా ప్రస్తుతం పవన్‌.. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో పెత్తనం కోసం చూస్తున్న బిజెపికి పెద్ద షాక్‌ ఇచ్చాడు. మార్చినెలలో వైజాగ్‌ ఆర్కేబీచ్‌లో 'దక్షిణ భారతీయుల ఆత్మగౌరవ శాంతియుత నిరసన'కు పిలుపునిచ్చాడు. ఈ విషయమై ఆయన తనకున్న పరిచయాలతో తమిళ, కన్నడ, మలయాల, తెలుగు సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను ఈ ఆందోళనకు తరలి రావాల్సిందిగా మంతనాలు జరుపుతున్నాడు. దీన్ని కూడా వైసీపీ జగన్‌, టిడిపి, కాంగ్రెస్‌ వంటి బూర్జువా పార్టీలు దీనిని కూడా హైజాక్‌ చేయకుండా పవన్‌ ఇప్పటి నుంచే అప్రమత్తం కావాల్సివుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ