Advertisementt

హీరోస్... ఫ్యాన్స్‌ వాస్తవాలు గ్రహించాలి..!

Sat 28th Jan 2017 09:29 PM
chiranjeevi,balakrishna,fans,shatamanam bhavathi,khaidi no 150,gpsk  హీరోస్... ఫ్యాన్స్‌  వాస్తవాలు గ్రహించాలి..!
హీరోస్... ఫ్యాన్స్‌ వాస్తవాలు గ్రహించాలి..!
Advertisement
Ads by CJ

సినిమా వ్యాపారంలో అనేక చిత్ర విచిత్రాలు, అనుకోని ట్విస్ట్‌లు ఉంటాయి. ఇవి ఏ సినీ ట్రేడ్‌ పండితుడుని అడిగినా చెబుతాడు. ఓచిత్రం విజయం, పరాజయం అనేవి అవి వసూలు చేసే కలెక్షన్లను బట్టి ఉండవు. ఆ చిత్రానికి బడ్జెట్‌ ఎంత అయింది? ఎంత రేటుకు అమ్మారు? ఎంత వసూలు చేసిందనే దాని మీదే నిజమైన విజయం ఆధారపడి ఉంటుంది. సంక్రాంతి రేసులో చిరు 'ఖైదీ నెంబర్‌ 150', బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాలు పోటాపోటీగా బరిలోకి నిలిచాయి. దీంతో పాటు భారీ ఓపెనింగ్స్‌ను కూడా రాబట్టాయి. దీంతో ఆయాహీరోల అభిమానులు మా హీరో చిత్రం ఇంత కలెక్ట్‌ చేసిందంటే.. కాదు..కాదు.. మా హీరో చిత్రం ఇంత కలెక్ట్‌ చేసిందనే లెక్కలపై దృష్టిపెట్టారే గానీ, ఈ చిత్రాలలో ఏ సినిమా నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టిందనే విషయాన్ని మాత్రం విస్మరించారు. 

వాస్తవానికి ఈ రెండు చిత్రాలకు పెట్టిన బడ్జెట్‌ చాలా ఎక్కువ. చిరు చిత్రం కోసం 'కత్తి'ని రీమేక్‌ చేయడానికి ఎంత మొత్తాన్ని కేటాయించారో మెగాభిమానులకు తెలుసా? అలాగే బాలయ్య చేసిన 'గౌతమీపుత్ర..'చిత్రం కోసం క్రిష్‌ ఎంత బడ్జెట్‌ను కేటాయించాడో తెలుసా? అనే విషయాలను అభిమానులు విస్మరించారు. కానీ ఇదే పోటీలో అండర్‌డాగ్‌గా, చిన్నబడ్జెట్‌ చిత్రంగా వచ్చిన దిల్‌రాజు-శర్వానంద్‌ల 'శతమానం భవతి' బడ్జెట్‌ ఎంతో ముందు అభిమానులు తెలుసుకోవాలి. ఈ చిత్రం నేడు లోబడ్జెట్‌చిత్రాలన్నింటిలోకి టాప్‌ గ్రాసర్‌గా, టాప్‌ షేర్‌ సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా 30కోట్లకు చేరువైంది. లాంగ్‌రన్‌లో కనీసం 25 నుంచి 30కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉందని ట్రేడ్‌పండితులు చెబుతున్నారు. 

ఇక స్వదేశీ పరిమళాలు ఉన్న ప్రేమానుబంధాల మీద తీసిన చిత్రం కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో, చిత్రంలోని కంటెంట్‌ విషయంలో, శర్వానంద్‌, అనుపమపరమేశ్వరన్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధలతోపాటు ఇతర నటీనటుల అద్భుతప్రదర్శన, సతీష్‌వేగ్నేష్‌ దర్శకత్వ ప్రతిభ, దిల్‌రాజు నమ్ముకున్న కథ, అనుసరించిన పబ్లిసిటీ వ్యూహం వంటివి ఈ చిత్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇక ఈ చిత్రం శాటిలైట్‌రైట్స్‌తో పాటు ఇతర ఆదాయాలన్నీ కలిపితే చిరు, బాలయ్య చిత్రాల కంటే ఈ చిత్రమే ఎక్కువ లాభాలను సంపాదించిందనేది వాస్తవం. దీన్ని బట్టి అసలైన సంక్రాంతి విజేత ఎవరో అర్ధమై ఉంటుంది. ఎనీ డౌట్స్‌.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ