Advertisementt

చిరు ఊహించలేదట అతడు హీరో అవుతాడని..!

Sat 28th Jan 2017 05:49 PM
hero sharwanand,shatamanam bhavathi,chiranjeevi,vv vinayak,dil raj,prakash raj  చిరు ఊహించలేదట అతడు హీరో అవుతాడని..!
చిరు ఊహించలేదట అతడు హీరో అవుతాడని..!
Advertisement
Ads by CJ

ఈ సంక్రాతి రేసులో పెద్ద హీరోలతో పోటీకి దిగి హిట్ కొట్టిన 'శతమానం భవతి' చిత్రం సక్సెస్ సెలెబ్రేషన్స్ ని జరుపుకుంది. శర్వానంద్ అటు చిరంజీవికి, బాలకృష్ణ కి 'శతమానం భవతి'తో వారికి గట్టి పోటీ ఇచ్చాడు. పోయిన సంక్రాంతికి కూడా 'ఎక్స్ప్రెస్ రాజా'ని స్టార్ హీరోస్ నటించిన సినిమాల మధ్యన విడుదల చేసి హిట్ కొట్టిన శర్వా ఇప్పుడు 'శతమానం భవతి'తో మరోసారి సంక్రాతి హిట్ హీరో అనిపించుకున్నాడు. ఇక నిన్నరాత్రి జరిగిన 'శతమానం భవతి' సక్సెస్ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిధిగా చిరంజీవి, వి.వి.వినాయక్ లు పాల్గొన్నారు. 

ఇక చిరు మాట్లాడుతూ... శర్వా చిన్నప్పటినుండి రామ్ చరణ్ కి మంచి ఫ్రెండ్. చిన్నప్పటి నుండి మాఇంట్లో తిరుగుతూ పెరిగాడు. అసలు చాలా నెమ్మదిగా ఉండే శర్వా హీరో అవుతాడని నేను అనుకోలేదని..... శర్వానంద్ సినిమాల్లో నటిస్తాడని చరణ్ చెబితే నాకు ఒకింత ఆశ్చర్యం కలిగిందని.... అలాటిది మొట్ట మొదటిసారి నాతో ఒక యాడ్ లో కలిసి నటించాడని చెప్పుకొచ్చాడు. అలాగే నాతొ కలిసి 'శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ లో చిన్న రోల్ లో శర్వానంద్ నటించాడని చెప్పాడు. అలాంటి శర్వానంద్ ఒక్కసారిగా హీరోగా మారి వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడని.... ప్రశంసల వర్షం కురిపించాడు చిరు.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ