సినిమాల్లో కమెడియన్ వేషాలేసుకుంటూ కాలం గడిపే బండ్ల గణేష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రొడ్యూసర్ అవతారమెత్తాడు. ఎక్కడి నుండి వచ్చిందో అంత డబ్బు తెలియదు గాని ఏకంగా పవన్ కళ్యాణ్ ని ప్రొడ్యూస్ చేసే రేంజ్ కి గణేష్ ఒక్కసారిగా ఎదిగాడు. అయితే గణేష్ వెనుక ఎవరో ఉండి ఈ సినిమా నిర్మాణ పనుల్ని గణేష్ చేయిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. ఎవరికో బినామీ కింద బండ్ల గణేష్ పనిచేస్తున్నాడని ఒకటే వార్తలు వెబ్ మీడియాలో గుప్పుమన్నాయి. అయినా గణేష్ ఎక్కడా తొణకకుండా బెణకకుండా నిర్మాతాగానే వ్యవహరించాడు.
అయితే ఈ మధ్యన చాలాకాలం నుండి గణేష్ ఎక్కడా వార్తల్లోకి లేకుండా పోయాడు. ఎక్కడా సినిమాని నిర్మిస్తున్నాడన్న టాక్ కూడా లేదు. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు గణేష్ తనకి ఒక హీరోకి జరిగిన ఒక గొడవ గురించి ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పాడు. నా లైఫ్ లో నేను చేసిన అతిపెద్ద తప్పు సచిన్ జోషితో ఫ్రెండ్షిప్ చెయ్యడమే అని చెప్తున్నాడు. అంతలా ఎందుకు బాధపడుతున్నాడంటే సచిన్ జోషితో ‘నీ జతగా నేనుండాలి’ అనే సినిమా చెయ్యడం. కేవలం ఫ్రెండ్ కి హెల్ప్ చేద్దామన్న కారణంగానే ‘నీజతగా నేనుండాలి’ సినిమా కి నా బ్యానర్ పేరు ఇవ్వడానికి అంగీకరించా. ఆ సినిమాకు పెట్టుబడు సచిన్ పెట్టుకున్నాడు. అయితే ఆ సినిమా ప్లాప్ అవడంతో ఆ సినిమాతో నష్టపోయిన డబ్బుని నా దగ్గర నుండి వసూలు చేద్దామని చూశాడంట.
అయినా అలా సచిన్ కి డబ్బు ఇవ్వడానికి నాకేమైనా పిచ్చా.. డబ్బులు సంపాదించుకుందామనుకునే వారెవరైనా సచిన్ జోషితో సినిమా చెయ్యాలనుకుంటాడా.... ఇక అప్పటినుండి మా మధ్య గొడవలు స్టార్ట్ ఆయనని చెప్పాడు. ఇక సచిన్ అయితే నన్ను జైల్లో కూడా పెట్టిస్తానన్నాడు.... జైల్లో కలుద్దామని ట్వీట్ కూడా చేసాడు సచిన్ జోషి అని చెప్పుకొచ్చాడు. దానికి నేనెందుకు భయపడతా... నా సర్కిల్ ఏమి అల్లాటప్పాది కాదు. నేను తలచుకుంటే వారంలో ట్రంప్‌తో ఫోటో దిగి చూపెడాతా అని సచిన్ ని పరోక్షంగా హెచ్చరించాడు బండ్ల గణేష్.