Advertisementt

తెలిసి తెలిసి మహేష్ తప్పుచేస్తున్నాడు!

Sat 28th Jan 2017 01:52 PM
mahesh babu,rajakumarudu movie,dubbing,tamil  తెలిసి తెలిసి మహేష్ తప్పుచేస్తున్నాడు!
తెలిసి తెలిసి మహేష్ తప్పుచేస్తున్నాడు!
Advertisement

మహేష్‌ ప్రస్తుతం కోలీవుడ్‌ మార్కెట్‌పై కన్నేశాడు. కాగా గతంలో ఆయన నటించిన 'అతడు, దూకుడు, '1' నేనొక్కడినే, శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం' వంటి చిత్రాలు తమిళంలోకి అనువాదమయ్యాయి. కానీ ఈ చిత్రాలేవీ ఆయనకు అక్కడ సరైన గుర్తింపును తేలేకపోయాయి. కాగా ప్రస్తుతం ఆయన మురుగదాస్‌తో చేస్తున్న ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న మూవీపై కోలీవుడ్‌లో కూడా మంచి అంచనాలున్నాయి. ఈ చిత్రం ద్వారా మహేష్‌ స్ట్రెయిట్‌గా తమిళ మార్కెట్‌ను కొల్లగొట్టాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు కావడంతో తమిళనాడులో ఈ అంచనాలు బాగా పెరిగాయి. దాంతో ప్రస్తుతం తమిళనాట మహేష్‌ చిత్రానికి ఏర్పడుతున్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని ఆయన పాత చిత్రాల నిర్మాతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా 1999లో ఆయన హీరోగా తెలుగులో పరిచయం అయిన మొదటి చిత్రం 'రాజకుమారుడు'ను 18ఏళ్ల తర్వాత తమిళంలోకి డబ్‌ చేశారు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకుడు కాగా అశ్వనీదత్‌ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ప్రీతీజింటా, ప్రకాష్‌రాజ్‌ తదితర తమిళులకు పరిచయమైన నటీనటులు నటించడంతో దీనిని తమిళంలో డబ్‌ చేసి విడుదల చేస్తున్నారు. 

సాధారణంగా ఒక హీరోకి ఓ చిత్రంతో ఒక భాషలో గుర్తింపు లభిస్తే, ఆయా నటులు నటించిన పాత చిత్రాలు కూడా తామరతంపరగా విడుదలై, ఆయా హీరోలకు ఉన్న క్రేజ్‌ను మంటగలపడం గతంలో ఎన్నోసార్లు చూశాం. కానీ ఆయా హీరోలకు పాత చిత్రాల నిర్మాతలపై సరైన కమాండ్‌ లేకపోవడమే దీనికి కారణం. కానీ మహేష్‌కు అశ్వనీదత్‌ చాలా సన్నిహితుడు. త్వరలో ఆయనకు, దిల్‌రాజుకు కలిపి మహేష్‌ వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాడు. ఇలాంటి సమయంలో 'రాజకుమారుడు' తమిళ డబ్బింగ్‌ను ఆపగలిగిన శక్తి మహేష్‌కు ఉంది.కానీ ఆయన కూడా ఈ చిత్రం విషయంలో ప్రేక్షకపాత్ర పోషించాడు. మరి మురుగదాస్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌ని కొల్లగొట్టాలని చూస్తోన్న మహేష్‌ ఈ అనువాద చిత్రం విషయంలో మౌనంగా ఉండటం సినీ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement