తెలుగులో కమెడియన్ నుండి ఎదిగి స్టార్ ప్రొడ్యూసర్‌గా, బ్లాక్‌బస్టర్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు బండ్లగణేష్. కాగా ఆయన టాలీవుడ్‌లో పలువురు స్టార్స్‌తో చిత్రాలు చేశాడు. కానీ పూరీ-ఎన్టీఆర్‌లతో చేసిన 'టెంపర్' చిత్రం తర్వాత ఆయన పరిశ్రమ నుంచి అర్ధాంతరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈయనపై బాలీవుడ్‌కు చెందిన హీరో, ఫైనాన్షియర్ సచిన్ చీటింగ్ ఆరోపణలు కూడా చేశాడు. మరోవైపు ఈయన బొత్స సత్యనారాయణకు బినామీ అనే పేరు కూడా ఉంది. బొత్స హవా సాగినంత కాలం ఈయన కూడా జయాపజయాలను అతీతంగా నిర్మాతగా ఓ వెలుగు వెలిగాడు. కానీ రాజకీయంగా బొత్స హవా తగ్గడంతో ఈయన కూడా సినిమాలు తీయడం ఆపేశాడనే ఓ వాదన కూడా ఉంది. కాగా ఇటీవల యూట్యూబ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బండ్లగణేష్ చేసిన పలు వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఆయన మాట్లాడుతూ, 'నా దేవుడైన పవన్‌కళ్యాణ్‌కు ఎవ్వరు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సమస్య వస్తే దానిని సొంతంగా పరిష్కరించుకోగల శక్తిసామర్ధ్యాలు పవన్‌కు ఉన్నాయి...' అన్నాడు. అలాగే రవితేజ తనను నమ్మి, తన పొలాన్ని ఎంతో ఇష్టంతో కొనుకున్నాడని, కానీ ఆ పొలం విషయంలో తాను రవితేజను మోసం చేశానని బాధపడ్డాడు. ఇక ఎన్టీఆర్‌తో తీసిన 'బాద్‌షా' చిత్రం తనకు తీవ్ర నష్టాలను మిగిల్చిందని, దానిపై ఎన్టీఆర్‌తో విభేదాలు వచ్చాయన్నాడు. తాను రాత్రంతా మద్యం తాగుతూ, డ్రగ్స్ వాడుతూ ఉండే ఓ దర్శకునితో పనిచేయడం ఎంతో బాధని కలిగిస్తోందన్నాడు. ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించాడు. కాగా త్వరలో బండ్ల గణేష్ కొందరి ప్రోత్సాహంతో 'టెంపర్' చిత్రాన్ని బాలీవుడ్‌లో రణవీర్‌తో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. మొత్తానికి బండ్ల ఇంటర్వ్యూ మాత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.