ఎంతటి పరిస్థితుల్లోనైనా ప్రజాప్రతినిధులు సహనం కోల్పోకుండా, సంయమనంతో వ్యవహించాలి. వారు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. కానీ రాజకీయాలంటే ఏమిటో తెలియని ఓ పారిశ్రామికవేత్త, టిడిపికి ఆర్ధికంగా అండదండలు అందించే వ్యక్తి మాత్రమే అయిన సుజనాచౌదరిని.. చంద్రబాబు ఏకంగా ఎంపీని చేసి కేంద్రమంత్రిని చేశాడు. ఇప్పటికే పలు ఆర్థిక కుంభకోణాలలో ఈయన నిందితుడు, వేలాది కోట్ల రూపాయలను బ్యాంకులకు ఎగ్గొట్టిన 'ఏపీ విజయ్‌మాల్యా'గా ఈయనకు ఘనమైన చరిత్ర కూడా ఉంది. ఈయన ఏపీ యువత తమ ఆత్మగౌరవంగా భావిస్తూ, ప్రత్యేకహోదా కోసం చేస్తున్న ఉద్యమాన్ని తన నోటి దురుసుతో చిన్నబుచ్చేలా చేశాడు. జల్లికట్టు స్ఫూర్తి కావాలంటే అక్కడి వెళ్లి కోళ్ల పందాలు, ఇంకా కావాలంటే పందుల పందాలు ఆడుకోవాలని ఎద్దేవా చేశాడు. పవన్‌తో సహా ఎవరైనా సరే ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజీల మధ్య ఉన్న తేడాను చెప్పాలని, ప్రత్యేకప్యాకేజీ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం ఏమిటో చెబితే తాను బదులిస్తానని చెప్పాడు. దీంతో ఏపీ యువత మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. తమ ఉద్యమాన్ని పందుల పందాలతో పోల్చడాన్ని యువత జీర్ణించుకోలేకపోతోంది. దీంతో వారు కూడా సుజనా వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇస్తున్నారు.
'ప్రత్యేకహోదా' నంది అయితే.. ప్రత్యేకప్యాకేజీ పంది వంటిదని వారు ఘాటుగా సమాధానం ఇస్తున్నారు. ఇక పవన్ కూడా సుజనా వ్యాఖ్యలను తప్పుపట్టారు. యువత ఉద్యమ స్ఫూర్తిని పందులతో పోల్చోడం చాలా దారుణమని ట్వీట్ చేశాడు. కాగా ఈ విషయంలో సుజనాను తప్పుపడుతూ యువత అన్‌పార్లమెంటరీ పదాలను వాడుతూ, తమ ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. ఇక రచయిత చిన్నికృష్ణ మరో అడుగు ముందుకేసి సుజనాను పందితో పోల్చాడు. పంది లాంటి నీ నుంచే ఆటను స్టార్ట్ చేస్తామన్నాడు. అలాగే ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న పవన్‌ను, జగన్‌ను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపాడు. మొత్తానికి ప్రత్యేక హోదా ఉద్యమం పుణ్యమా అని మన టాలీవుడ్ కూడా రోజు రోజుకు దీనికి మద్దతు తెలుపుతూ రావడం హర్షణీయమనే చెప్పాలి. మరోపక్క చంద్రబాబు మాట్లాడుతూ, పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని వారు తనను విమర్శించడం హాస్యాస్పదమని చెప్పాలి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశాడో అందరికీ అర్ధమవుతోంది. మరి పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలవలేని సుజనాను మంత్రిని చేసిన ఘనత బాబుకే దక్కుతుంది. ఇది చంద్రబాబులోని అసలు రూపాన్ని నగ్నంగా చూపెడుతోంది.