Advertisementt

చిరు సినిమా కోసం హీరోయిన్ల వేట స్టార్ట్!

Fri 27th Jan 2017 07:31 PM
chiranjeevi,chiru 151st movie details,ram charan,surendar reddy,anushka  చిరు సినిమా కోసం హీరోయిన్ల వేట స్టార్ట్!
చిరు సినిమా కోసం హీరోయిన్ల వేట స్టార్ట్!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఖైదీ నెంబర్ 150 చిత్రంతో భారీస్థాయిలో బాక్సాఫీసు రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. చాలా తక్కువ సమయంలోనే చిరంజీవి ఖైదీ నెంబర్ 150వ చిత్రం భారీస్థాయిలో వసూళ్ళను రాబట్టి రికార్డు స్థాయిలో నిలిచింది. దీన్ని బట్టి చిరంజీవి సినిమా వసూళ్ళపై అందరికి ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. మునుపటి వలెనే చిరంజీవి చిత్రాలను సమానంగా ఆదరించే అవకాశాలు ఉన్నాయని తెలిసిపోయింది. మెగాస్టార్ కు మంచి సినిమా పడితే సరికొత్త రికార్డులను కూడా సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నది తేలిపోయింది. కాబట్టి చిరంజీవిపై ఇక ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేకపోవడంతో వెంటనే చిరంజీవి తర్వాత చిత్రంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

ఖైదీ నెంబర్ 150 ఈ ఉత్సాహంతోనే త‌న త‌దుప‌రి సినిమా మొద‌లెట్టేందుకు స‌న్నాహాలు చేసేస్తున్నాడు చిరు. ఇప్ప‌టికే త‌న 150 చిత్రం సృష్టించిన రికార్డుల ఉత్సాహంతో చిరంజీవి తన తర్వాత చిత్రంపైన పూర్తిగా దృష్టి  సారించినట్లు తెలుస్తుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా అప్పుడే సురేందర్ రెడ్డిని కూడా ఎంచుకున్నాడు. ఈ చిత్రానికి కూడా నిర్మాతగా రామ్ చ‌ర‌ణ్  వ్య‌వ‌హించ‌నున్న సంగ‌తి తెలిసిందే. సినిమాకు కావలసిన నిర్మాత‌, ద‌ర్శ‌కుడు ఓకే కావడంతో ఇక సినిమాకు ఆయువు పట్టయిన హీరోయిన్ ఎంపికలో వున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.  

చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రం హీరోయిన్ కోసం చాలా కాలం వెతుకులాడిన విషయం తెలిసిందే. చాలా మందిని చూసి చూసి చివరికి కాజ‌ల్‌ని ఎంచుకొని సినిమా తీసేశారు. చిరంజీవి 150 చిత్రంలో హీరోయిన్ కోసం చేసిన హడావుడి చేయకుండా ముందుగానే హీరోయిన్ ని ఎంపిక చేయాలనుకుంటుంది చిత్రబృందం. 

ఈ సినిమా ఏదైనప్పటికీ ఏప్రిల్‌లో షూటింగ్ మాత్రం తప్పకుండా ప్రారంభం చేయాలని చరణ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అప్ప‌టికి ఏ హీరోయిన్ అందుబాటులో ఉంటుందోనని చరణ్ పరిశీలిస్తున్నాడు. తాజాగా చిరంజీవి సరసన అనుష్క హీరోయిన్ అయితే సెట్ అవుతుందని మెగా కాంపౌండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అనుష్క కోసం ఖైదీ నెం.150 చిత్రానికే తీవ్రంగా ప్రయత్నం చేసినా కాల్షీట్లు స‌ర్దుబాటు కాకపోవడంతో ఇక కాజ‌ల్‌ను తీసుకున్నారు. కానీ ఈసారి తప్పకుండా అనుష్క‌ని తీసుకోవాలని చరణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక తీసేది సురేందర్ రెడ్డే కాబట్టి హీరోయిన్ అనుష్కనా మరెవరినైనా ఎంపిక చేస్తారా అన్నది వేచి చూడాలి.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ