Advertisementt

పవన్ కళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ నిరాహార దీక్షా..?

Fri 27th Jan 2017 07:05 PM
pawan kalyan,andhra pradesh,special category status,indefinite fast  పవన్ కళ్యాణ్  నెక్ట్స్ స్టెప్ నిరాహార దీక్షా..?
పవన్ కళ్యాణ్ నెక్ట్స్ స్టెప్ నిరాహార దీక్షా..?
Advertisement
Ads by CJ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం గత కొన్ని నెలలుగా సీరియస్ గా పోరాడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదాకోసం పోరాటంలో భాగంగా జనసేన పార్టీ నుండి తిరుపతి, కాకినాడ, అనంతపురం వంటి పట్టణాల్లో పలు సభలు పెట్టి ప్రజలను మేల్కొల్పిన విషయం తెలిసిందే. అదే చైతన్యంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ, ఎవరికి సమస్యలు వచ్చినా, ఎవరు గోడు వినిపించినా వారి సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. అలా ఈ మధ్య పలు రకాల సమస్యల వద్దకు పవన్ స్వయంగా వెళ్ళడంతో ప్రభుత్వం కదిలి వాటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే స్పందించి తగిన పరిష్కార మార్గాన్ని తెలియజేసిన విషయం కూడా తెలిసిందే.

అలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత వారం రోజుల నుండి పవన్ ప్రత్యేక హోదా కోసం వైజాగ్ ఆర్కే బీచ్ లో తెలుగు యువత చేపట్టే శాంతియుత ర్యాలీకి మద్దతిచ్చి పలు రకాల ట్వీట్ల వర్షం కురిపిస్తూ.. యువతను ఆ రకంగా చైతన్యపరుస్తున్న విషయం కూడా విదితమే. కాగా ఈ రోజు వైజాగ్ లో యువత శాంతియుతంగా తలపెట్టిన నిరసనపై ప్రభుత్వం జరిపిన దారుణకాండ ఎమర్జెన్సీని తలపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో తీవ్ర ఆవేదనకు లోనైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. అయితే ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రధానంగా వైజాగ్ కేంద్రంగా యువతపై ప్రభుత్వం జరిపిన పరిస్థితులపై పవన్ ఎలా స్పందిస్తాడు అన్న విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది. కాగా పవన్ జరపబోయే ఈ ప్రెస్ చాలా కీలకమైన అంశంగా తెలుస్తుంది.

ఎందుకంటే... పవన్ ఇన్ని రోజులు జరిపిన రాజకీయాలు ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరపాల్సిన, చేయాల్సిన సిసలైన రాజకీయాలు ఒకఎత్తు. ప్రజల్లో ఒక రాజకీయ నాయకుడుగా ప్రజల్లో నుండి ప్రజా నాయకుడుగా పవన్  బయటకు రావాలి అంటే తాను శుక్రవారం తీసుకొనే నిర్ణయాలు ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పేవిగా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ చాలా కసిగా ట్వీట్ల వర్షాన్ని కురిపిస్తూ... రాజకీయ నేతలపై కూడా విరుచుకు పడుతూ.. ప్రతి అంశాన్ని తగిన విధంగా తరచి తరచి చూస్తూ చాలా బలంగా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా కొందరి పట్ల మెతక వైఖరి ఏమాత్రం ప్రదర్శించకుండా న్యాయాన్యాయాలను బేరీజు వేసుకుంటూ... ఎటువంటి పక్షపాత దోరణికి లోను కాకుండా పవన్ తన అభిప్రాయాన్ని చాలా సమర్ధంగా ప్రకటించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఆదిశగానే పవన్ మెలిగితే చక్కటి రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.

అయితే ప్రస్తుతం వైజాగ్ లో జరిగిన, ప్రభుత్వం జరిపిన అణచివేతను బట్టి పవన్ లోనైన ఆవేశాన్ని గమనిస్తే ఇక సరాసరి పవన్ నిరాహార దీక్షకు సైతం కూర్చునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ యువత జరిపిన వైజాగ్ శాంతియుత నిరసనకు వ్యతిరేకంగా ప్రభుత్వం  ప్రదర్శించిన ఎమర్జన్సీ వాతావరణానికి పవన్ ఆవేదనకు లోనే నిరాహార దీక్షకు గాని కూర్చుంటే... నిజంగా పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడుగా ముందు ముందు ఆంధ్రప్రదేశ్ లో బలమైన రాజకీయ నాయకుడుగా ఎదిగే అవకాశం మెండుగా ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్న అంశం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ