తెలుగులో మల్టీస్టారర్ సినిమాలు తక్కువే. ఇద్దరు స్టార్స్‌తో సినిమా తీయాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవు. అయితే స్టార్స్ అందరితో సత్సంబంధాలు, తనంటే గౌరవం ఉన్న దర్శకేంద్రుడు తన వందవ సినిమాగా మల్టీస్టారర్ తీయాలని ప్రయత్నం చేశారట. ఇందుకోసం చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌లను సంప్రదిస్తే సంతోషంగా అంగీకరించారని చెప్పాడు. రచయిత చిన్నికృష్ణ 'త్రివేణి సంగమం' పేరుతో కథని కూడా సిద్దం చేశాడట. కేవలం ముగ్గురు స్టార్స్‌తో మాత్రమే ఎందుకు ప్లాన్ చేశారు. మరో స్టార్ హీరో బాలకృష్ణను ఎందుకు మరిచారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. చివరికి తన వందవ సినిమాగా మల్టీస్టారర్ కాకుండా అల్లు అర్జున్‌తో 'గంగోత్రి' తీసి సక్సెస్ సాధించారు. ఈ ఫ్యాష్‌బ్యాక్‌ను ఇటీవల ఒక టీవీ ప్రోగ్రామ్‌లో కె.రాఘవేంద్రరావు స్వయంగా చెప్పారు.
మరి మల్టీస్టారర్ సినిమా ఎందుకు డ్రాప్ అయినట్టు? అంటే దీనికి సమాధానం కూడా ఆయనే చెప్పారు. మల్టీస్టారర్ అనగానే హీరోలందరికీ తగిన న్యాయం జరగాలి. పాటలు పంచాలి, డ్రస్స్‌ల విషయంలో, హీరోయిన్ల విషయంలో తేడా రావద్దు. ఇలాంటి రిస్క్ చేయడం ఎందుకని వందవ సినిమా నిర్మాతల్లో ఒకరైన అశ్వనీదత్ సంశయం వ్యక్తం చేయడంతో డ్రాప్ అయ్యారట. ఈ కారణంగా అల్లు అర్జున్ తెరపైకి వచ్చాడు.