Advertisementt

యంగ్‌ స్టార్‌ చిత్రానికి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌..!

Thu 26th Jan 2017 05:56 PM
tamil hero dhanush,kajal,vip 2 movie,rajinikanth,director soundarya  యంగ్‌ స్టార్‌ చిత్రానికి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌..!
యంగ్‌ స్టార్‌ చిత్రానికి మరో స్పెషల్‌ అట్రాక్షన్‌..!
Advertisement
Ads by CJ

రజనీకాంత్‌ అల్లుడైనప్పటికీ తన సొంత సత్తాతో యంగ్‌స్టార్‌గా మారిన హీరో ధనుష్‌. కాగా ఆయనకు గత కొంతకాలంగా సరైన హిట్‌ లేదు. 'విఐపి' చిత్రమే ఆయనకు లభించిన చివరి పెద్ద హిట్‌. దాంతో ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా ఆయన 'విఐపి2' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఇటీవలే రజనీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకు ధనుష్‌ మరదలు, రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తోంది. ఈ చిత్రం ధనుష్‌తో పాటు 'కొచ్చాడయాన్‌' వంటి డిజాస్టర్‌ తీసిన సౌందర్యకు సైతం కీలకంగా మారింది. గత కొంతకాలంగా ఈ చిత్రంలో ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌ కీలకపాత్రలో నటిస్తోందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆమె ఎవరో తెలిసిపోయింది. నిన్నటితరం బాలీవుడ్‌ టాప్‌హీరోయిన్‌ కాజోల్‌ ఈ చిత్రంలో నటిస్తోంది. 

తాజాగా ఆమె ఈ చిత్రం కోసం వారం రోజులు డేట్స్‌ కేటాయించి, ఈ చిత్ర బృందంతో జాయిన్‌ అయింది. ఈ విషయం గురించి దర్శకురాలు సౌందర్య మాట్లాడుతూ, ఇందులో విభిన్నకోణాలున్న ఓ పాత్రను కాజోల్‌ చేస్తోందని తెలిపింది. ధనుష్‌తో పోటీపడే బిజినెస్‌ లేడీగా కాజోల్‌ కాస్త నెగటివ్‌ చాయలున్న పాత్రను చేస్తోంది. ఈ చిత్రం కాజోల్‌కు మొదటి తమిళ చిత్రమేమీ కాదు. ఆమె 1997లో అరవింద్‌స్వామి, ప్రభుదేవాలు హీరోలుగా వచ్చిన 'మెరుపుకలలు' తమిళ వెర్షలో హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. మొత్తానికి చాలా గ్యాప్‌ తర్వాత మరో తమిళ చిత్రం చేయడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. మరి ఈ చిత్రమైనా ఆమెకు హిట్‌ను ఇస్తుందో? 'మెరుపుకలలు' ఫలితాన్నే మరలా అందిస్తుందో చూడాలి. కాగా ధనుష్‌ తాను కాజోల్‌తో కలిసి ఉన్న మోషన్‌ పిక్చర్‌ను తాజాగా ట్వీట్‌ చేశాడు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ