Advertisementt

అందరికి షాక్ ఇచ్చిన హీరో...!

Thu 26th Jan 2017 05:09 PM
hero ravi teja,touch chesi chustara movie,director vikram sirikonda,raja the great movie,director anil ravipudi  అందరికి షాక్ ఇచ్చిన హీరో...!
అందరికి షాక్ ఇచ్చిన హీరో...!
Advertisement
Ads by CJ

రవి తేజ లాంగ్ గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండు సినిమాలతో తన 'పవర్' చూపించడానికి వచ్చేస్తున్నాడు. ఫస్ట్ లుక్ ల మీద ఫస్ట్ లుక్స్ వదులుతూ నేను మళ్ళీ  బిజీ అనే రీతిలో చెలరేగిపోవడానికి రెడీ అయిపోయాడు. ఇక రవితేజ బర్త్  డే సందర్భంగా నిన్నటికి నిన్న 'టచ్ చేసి చూస్తారా' అంటూ ఎనర్జీ కి మారుపేరు నేనే అనే రీతిలో పోస్టర్స్ ని రిలీజ్ చేసిన రవితేజ తాజాగా ఇప్పుడు 'రాజా ది గ్రేట్' అంటూ మరో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రివీల్ చేసేసాడు. ఇప్పటిదాకా సైలెంట్ గా వున్న రవి ఇలా ఒక్కసారిగా తన సినిమాలను మొదలు పెట్టి అందరికి దాదాపు షాక్ ఇచ్చేసాడు.  

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో 'టచ్ చేసి చూస్తారా' చేస్తున్న రవితేజ, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో  'రాజా ది గ్రేట్' మూవీ ని కూడా లైన్ లో పెట్టేసాడు. ఇక  ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా నటించబోతున్నాడట. అసలు ఈ స్టోరీ ముందుగా రామ్ పోతినేని చెయ్యాల్సి ఉండగా అతను ఎందుకో రిజెక్ట్ చెయ్యడం వల్ల మళ్ళా ఆ స్టోరీ యాంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లగా అక్కడ కూడా వర్క్ అవుట్ అవ్వక ఇప్పుడు రవితేజ దగ్గరికి వచ్చిందని టాక్. అయితే చిన్న చితకా మార్పులతో రవితేజ, అనిల్ రావిపూడి స్టోరీ ని ఫైనల్ చేసాడని ఇంకా వీరి కాంబినేషన్ లో ఆ చిత్రం పట్టాలెక్కిందని సమాచారం.

ఇక ఈ రెండు ప్రాజెక్ట్ లతో రవితేజ ఒక్కసారిగా యమా బిజీ అయిపోయాడు. ఇక ఈ రెండు ప్రాజెక్టులను ఏక కాలంలో పూర్తి చేసి కొద్దీ రోజుల తేడాతో ఈ సినిమాలు విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని టాక్.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ