ఒక సినిమాలో స్టార్స్ కు ఒక పాత్ర సృష్టించడమే కష్టం. అలాంటిది ఒకే హీరోకు రెండు, మూడు క్యారెక్టర్లను ఒకే సినిమాలో సృష్టించాలంటే ఛాలెంజ్ లాంటిది. ఇతర భాషలతో పోలిస్తే తెలుగు హీరోలే ఎక్కువగా ద్విపాత్రాభినయం చేశారు. వీరిలో హీరో కృష్ట 25 సినిమాల్లో రెండు పాత్రలు చేసి రికార్డ్ నెలకొల్పారు. మూడు పాత్రల్లో కూడా ఆయనదే రికార్డ్. ఆరు సినిమాల్లో (కుమారరాజా, పగబట్టిన సింహం, రక్తసంబంధం, బంగారు కాపురం, డాక్టర్ సినీ యాక్టర్, బొబ్బిలి దొర) సినిమాల్లో త్రి పాత్రాభినయం చేశారు. పౌరాణికాల్లో ఎన్టీఆర్ ది రికార్డ్. ఆయన దానవీరశూర కర్ణలో మూడు, శ్రీ తిరుపతి వేంకటేశ్వర కల్యాణంలో ఐదు పాత్రలు చేశారు. అక్కినేని నవరాత్రి అనే సినిమాలో తొమ్మిది క్యారెక్టర్లు చేశారు. శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్ళు, చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు సినిమాల్లో మూడు పాత్రలు చేశారు.
నేడున్న సాంకేతిక పరిజ్ఞానంతో రెండు క్యారెక్టర్లు సులువుగా చేస్తున్నారు.
యువ హీరోల్లో జూ.ఎన్టీఆర్ త్రి పాత్రాభినయం చేయనున్నరనేది తాజా వార్త. ఆయన ఇప్పటికే అదుర్స్ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. మూడు పాత్రలు చేయడం మాత్రం సాహసమే అయినప్పటికీ అభినందనీయమే.