Advertisementt

'పద్మాలు' తెలుగు వారికి అన్యాయమే..!

Thu 26th Jan 2017 01:04 PM
padma awards 2017,dasari narayana rao,vijaynirmala,kodi ramakrishna,raghavendra rao,kj yesudas,republicday  'పద్మాలు' తెలుగు వారికి అన్యాయమే..!
'పద్మాలు' తెలుగు వారికి అన్యాయమే..!
Advertisement

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల విషయంలో మరోసారి తెలుగు సినీరంగానికి మరోసారి అన్యాయమే జరిగింది.  ఇతర రంగాలను గుర్తించిన విధంగా తెలుగు సినీరంగాన్ని మాత్రం గుర్తించలేదు. తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన కళాకారులను గౌరవించలేదు. ప్రపంచ రికార్డ్ నెలకొల్పి, గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన దర్శకులు దాసరి నారాయణరావు, విజయనిర్మలకు పద్మాలు దక్కలేదు. దర్శకులుగా వీరు నెలకొల్పిన రికార్డులు మరెవరూ ఛేదించలేనివి. శతాధిక   చిత్రాల దర్శకులు కె.రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, గతంలో జాతీయ అవార్డు పొందిన గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, ఇంకా సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి వారిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన కైకాల సత్యనారాయణ, చంద్రమోహన్ వంటి వారిని గుర్తించలేదు. అత్యంత సీనియర్ నటి రమాప్రభ పేరు పరిశీలించలేదు. ఇలా అనేక మందికి మొండిచేయి తప్పలేదు. గతంలో ఇలాంటి రికార్డ్ ఉన్న ఇతర భాషలకు చెందిన వారికి పద్మాలు దక్కాయి.

రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసుతోనే కేంద్రం పద్మ పురస్కారాల పేర్లను పరిశీలిస్తుందని అంటారు. ఆ ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సినీ ప్రముఖుల పేర్లను సిఫారసు చేయలేదని భావించాలా? లేక లిస్ట్ పంపించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని అనుకోవాలా.? లేదా పైరవీలదే పైచేయి అయిందని భావించాలా. దీనిపై మన నేతలు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. 

కర్నాటకు చెందిన నటి భారతి, ఉత్తరాదికి చెందిన గాయకుడు కైలాష్ ఖైర్, గాయని అనురాధ పౌడ్వాల్ పద్మ గౌరవాలు పొందారు. ప్రసిద్ద గాయకుడు కేజే ఏసుదాసుకు పద్మవిభూషణ పురస్కారం ఇవ్వడం అందరికీ సంతోషమే.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement