Advertisement

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కి డైరెక్టర్ రెడ్డే..!

Thu 26th Jan 2017 12:53 PM
uyyalavada narasimha reddy,surendar reddy,chiranjeevi,paruchuri brothers,dhruva,ram charan  'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కి డైరెక్టర్ రెడ్డే..!
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కి డైరెక్టర్ రెడ్డే..!
Advertisement

చిరంజీవి లాంగ్ గ్యాప్ తర్వాత 'ఖైదీ నెంబర్ 150' తీసి అదిరిపోయే హిట్ కొట్టాడు. ఇక 'ఖైదీ...' సినిమాతో తన జోరు మరింత పెంచాలని ఆలోచిస్తున్న చిరు 151  చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మాణంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి కి కమిట్ అయ్యాడని తెలిసిన విషయమే. ఇప్పటికే 150  వ చిత్రం 'ఖైదీ....'తో ప్రభంజనం సృష్టిస్తూ తనలోని నటన, డాన్సులోని గ్రేస్, ఫైట్స్ లోని పవర్ ఏ మాత్రం తగ్గలేదని రుజువు చేసిన చిరు తన అప్ కమింగ్ మూవీస్ కోసం ఇంకా స్లిమ్ గా తయారవ్వాలని తెగ వర్కౌట్స్ చేస్తున్నాడట.

ఇక సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా... అని అప్పుడే మెగాభిమానులు చర్చ మొదలు పెట్టేసారు. అయితే చిరు మాత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' అనే కథ మీదే ఎక్కువ కాన్సంట్రేట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించడానికి చిరు ఉత్సుకత చూపిస్తున్నాడని చెబుతున్నారు. ఇప్పటికే ఈ 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ ని పరుచూరి బ్రదర్స్ డెవెలెప్ చేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. 

ఇక 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథని సురేందర్ రెడ్డే తెరకెక్కిస్తాడని సమాచారం. అయితే సురేందర్ రెడ్డి డిఫరెంట్ స్టోరీ తో ఒక స్టైలిష్ లుక్ తో చిరుని ప్రెజెంట్ చెయ్యాలనుకున్నాడు. కానీ ఇప్పుడు చిరంజీవి చెప్పినట్టు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కథతో హిస్టారికల్ బయోపిక్‌ను చెయ్యడానికి సురేందర్ రెడ్డి ఓకె చెప్పాడని టాక్. వచ్చే వేసవిలో సినిమాని ప్రారంభించే యోచనలో చిరు అండ్ టీమ్ ఉన్నట్లు చెబుతున్నారు. 

మరి సురేందర్ రెడ్డి, రామ్ చరణ్ ని ఒక స్టైలిష్ స్టోరీ తో సినిమా చెయ్యాలనుకుంటే చరణ్ మాత్రం 'ధ్రువ' చిత్రాన్ని 'తని ఒరువన్' తమిళ చిత్ర  కథతో రెడ్డి తో రీమేక్ చేయించాడు. మరి ఇపుడు చిరు కూడా సురేందర్ రెడ్డి అనుకున్న స్టోరీ తో కాకుండా ఒక హిస్టారికల్ బయోపిక్‌ను తెరకెక్కించే పనిని సురేందర్ రెడ్డి కి అప్పజెప్పాడు. మరి సురేందర్ రెడ్డి కేవలం మెగా హీరోలు ఏం చెబితే అది చెయ్యడమే పనా? అని అందరూ అప్పుడే గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement