Advertisementt

మళ్లీ ఆ భామ కే సుక్కు-చరణ్ చిత్ర అవకాశం!

Thu 26th Jan 2017 11:27 AM
ram charan,sukumar,anupama parameswaran,samantha  మళ్లీ ఆ భామ కే సుక్కు-చరణ్ చిత్ర అవకాశం!
మళ్లీ ఆ భామ కే సుక్కు-చరణ్ చిత్ర అవకాశం!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్ లో ఒక చిత్రం అతి త్వరలోనే అంటే ఈ నెల 30 న పూజా కార్యక్రమాలతో మొదలు కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్తగా ఒక లవర్ బాయ్ లా కనబడనున్నాడనే ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రం 90 లలో ఓ పల్లెటూరి ప్రేమ కథగా ఉండబోతుందట. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా మొదట సమంత పేరు వినబడినప్పటికీ తర్వాత మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ని రామ్ చరణ్ కి జోడిగా ఎంపిక చేసినట్లే వార్తలొచ్చాయి. ఇక మరో హీరోయిన్ గా రాశి ఖన్నాని కూడా ఎంపిక చేశారని చెప్పారు.

కానీ గత రెండు మూడు రోజులుగా అనుపమ  పరమేశ్వర్ ని సుకుమార్ - రామ్ చరణ్ ప్రాజెక్ట్ నుండి తప్పించారని వార్తలు సోషల్ మీడియాలో ప్రముఖంగా ప్రచురించబడుతున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూర్చేలా అనుపమ తన ట్విట్టర్ లో నాకు ఏదైనా  అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయినా కూడా నాకు అన్నీ మంచే జరుగుతాయని ట్వీట్ చేసింది. ఇక ఈ దెబ్బకి అనుపమ ఈ ప్రాజెక్ట్ నుండి అవుట్ అని అందరూ గట్టిగా నమ్మేశారు. అయినా అసలు అనుపమని ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించడం వెనుక ఒక బలమైన కారణమే ఉందట. అదేమిటంటే అనుపమ టాలీవుడ్ లో నటించిన మూడు సినిమాలు వరుసబెట్టి హిట్ అవడంతో అమ్మడు తన రెమ్యునరేషన్ ని గట్టిగా పెంచేసి.. సుకుమార్ నిర్మాతలకు చుక్కలు చూపెట్టడం వలనే ఆమెను ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించారనే ప్రచారం జరుగుతుంది.

ఇక అనుపమ ప్లేస్ లోకి ఇప్పుడు సమంత వచ్చి చేరిందని అంటున్నారు. రామ్ చరణ్ కి జోడిగా సమంతానే ఈ చిత్రంలో హీరోయిన్ గా తీసుకుంటున్నారని చెబుతున్నారు. మరి మొదటగా అనుకున్న సమంతానే ఈ చిత్ర హీరోయిన్ గా ఫైనల్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టకముందే అవకాశాలు కోల్పోతున్న సమంత కి ఈ ఆఫర్ మాత్రం నెత్తి మీద పాలు పోసినట్లే. మరి ఇప్పటికైనా సమంత ని చరణ్ పక్కన ఫైనల్ చేస్తారా? లేక మరో హీరోయిన్ పేరు తెరమీదకి వస్తుందో? అనేది వేచి చూడక తప్పేలా లేదు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ