తమిళంలో మురుగదాస్ - విజయ్ కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ కాంబినేషనో అందరికి తెలిసిందే. ఇప్పటికే వీరి కాబినేషన్లో అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ విడుదలై సంచలనాలు సృష్టించాయి. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'తుపాకీ' తమిళంలో కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు ఇటు తెలుగులో కూడా విజయ్ మార్కెట్ ని పెంచేసింది. ఇక తర్వాత 'కత్తి' సినిమా విజయ్ ని తమిళంలో నెంబర్ 1 హీరోని చేసింది. 'కత్తి' సినిమాలో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఆ సినిమా కలెక్షన్స్ సునామి ఎంతలా సృష్టించిందో చెప్పక్కర్లేదు.
ఇలాంటి అదిరిపోయే కాంబినేషన్ లో మళ్ళీ ఒక సినిమా తెరకెక్కబోతుంది. విజయ్- మురుగదాస్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా మొదలవ్వడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇక ఈ హిట్ కాంబినేషన్ ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుందని సమాచారం. మరో సెన్సేషన్ హిట్ పై మురుగదాస్, విజయ్ కన్నేసినట్లు తెలుస్తుంది. మూడో హిట్ కూడా కొట్టి హ్యాట్రిక్ కాంబినేషన్ గా నిలవాలని వీరిద్దరూ ఆరాటపడుతున్నారని అంటున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. మరోవైపు మురుగదాస్, మహేష్ హీరోగా తెలుగు, తమిళంలో ఏకకాలంలో ఓకే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వీరు తీసే రెండు సినిమాలు పూర్తవ్వగానే.... మురుగదాస్, విజయ్ హీరోగా సినిమా చెయ్యడానికి సిద్ధమవుతాడట.
మరి సెన్సేషన్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న విజయ్, మురుగదాస్ ల మూడో ప్రాజెక్ట్ మీద ఎన్ని అంచనాలుంటాయో కదా..!