జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఆలోచన ఎలా ఉంది?. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేస్తూ, మద్దతు ప్రకటిస్తూనే ప్రధాని మోడీని లక్ష్యం చేసుకున్నారా? ఈ అనుమానం రాజకీయ పరిశీలకుల్లో కలుగుతోంది. మోడీని టార్గెట్ చేయడానికి పవన్ పావులు కదుపుతున్నారు. తొలుత దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ పెత్తనమంటే కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోడీ అనేది సుస్పష్టం అర్థం అవుతోంది.
గడచిన ఎన్నికల్లో బిజెపికి పవన్ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఎన్నికలయ్యాక పీఠంపై మోడీ కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. అధికారంలోకి వచ్చాక మోడీ, చంద్రబాబు ఇద్దరు కూడా పవన్ ప్రాధాన్యతను తగ్గించేశారు. ఒకటి రెండు సార్లు పవన్ ని చంద్రబాబు కలిసినప్పటికీ, మోడీ మాత్రం పూర్తిగా మర్చిపోయారు. ఈ విషయంపై పవన్ అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. కనీసం తన ఉనికిని కూాడా గుర్తించుకోని మోడీని పవన్ టార్గెట్ చేసే యత్నం చేస్తున్నారు. అందుకే హోదా ఉద్యమానికి మద్దతుగా విడుదల చేసిన గీతాలకు దేశ్ బచావో అనే నినాదం చేర్చారు. హోదా అనేది రాష్ట్ర స్థాయిలో జరుగుతుంటే దేశ్ బజావో అనడంలో పన్ ఉద్దేశం స్పష్టంగా అర్థం అవుతోంది.
త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ఉత్తరాది పెత్తనం అనే నినాదంతో ప్రజా ఉద్యమాన్ని నడపడానికి పవన్ సన్నాయత్త మవుతున్నారని తెలిసింది. జనసేనను ప్రజల పార్టీగా తీర్చిదిద్దడానికి ఈ నినాదం పనిచేస్తుందనేది ఆయన ఆలోచన. ఆంధ్రకు హోదా రాకపోవడానికి కూడా ఉత్తరాది పెత్తనమే కారణంగా పవన్ చూపబోతున్నారని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు.