Advertisementt

మొదటిసారి తమ్ముడికి 'జై' కొడుతున్నాడు!

Wed 25th Jan 2017 12:53 PM
pawan kalyan,janasena party,rk beach,nagendrababu,chiranjeevi  మొదటిసారి తమ్ముడికి 'జై' కొడుతున్నాడు!
మొదటిసారి తమ్ముడికి 'జై' కొడుతున్నాడు!
Advertisement
Ads by CJ

పవన్ విషయంలో నాగబాబు అన్నయ్య చిరుని సపోర్ట్ చేస్తూ పవన్ ని మాత్రం వాడు మాతో కలవకపోతే ఏంటి అనే ధోరణిలో చాలాకాలం నుండి మాట్లాడుతున్నాడు.ఒక్క నాగబాబు మాత్రమే మెగా ఫ్యామిలీ నుండి బహిరంగంగా పవన్ విషయంలో ఫైర్ అవుతున్నాడు. అలంటి నాగబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ ని సమర్ధిస్తున్నాడట. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ప్రతిపక్షాలతో పాటే సినిమా పరిశ్రమ కూడా జతగలిసి జంటగా ఏకమై వైజాగ్ సముద్ర తీరా ప్రాంతంలో ఈ నెల  26న ఆందోనలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఇక పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఈ ఉద్యమానికి నాయకత్వం వహించే సూచనలు గట్టిగానే కనబడుతున్నాయి. ట్వీట్స్ మీద ట్వీట్స్ చేస్తూ ఏపీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పవన్ తాజాగా ప్రత్యేక హోదా విషయమై కొన్ని సాంగ్స్  ని రీమిక్స్ చేసి సోషల్ మీడియా సాక్షిగా అభిమానులను ఉత్సాహపరుస్తున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ని పవన్ చిన్న అన్న నాగబాబు బలపరుస్తున్నాడని సమాచారం. ఇప్పటివరకు తన అన్న చిరంజీవి ఏది చేసిన కరెక్ట్ అని చెప్పే నాగబాబు తమ్ముడు పవన్ విషయంలో ఒంటికాలు మీద లేగుస్తూ మెగా ఫ్యాన్స్ కి పవన్ విషయంపై వార్నింగ్ ఇస్తూ అసహనం వ్యక్తం  చేస్తున్న నాగబాబు.... ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాపై ఆందోళనలు చేపడుతున్న పవన్ కి బాసటగా నిలవాలని అనుకుంటున్నాడని సమాచారం.. ఇక మిగిలిందల్లా చిరంజీవి, పవన్ కి మద్దతివ్వడమే. కానీ ఇప్పటిదాకా చిరు ఈ విషయమై ఎక్కడా నోరు మెదపకుండా సైలెంట్ గా ఉంటున్నాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ