Advertisementt

ట్రేడ్‌పండితులకి ఈ హీరో అస్సలు దొరకట్లే..!

Wed 25th Jan 2017 12:16 PM
dangal,amir khan,trade analytics,hruthik roshan,shahrukh khan,kabil,raees  ట్రేడ్‌పండితులకి ఈ హీరో అస్సలు దొరకట్లే..!
ట్రేడ్‌పండితులకి ఈ హీరో అస్సలు దొరకట్లే..!
Advertisement
Ads by CJ

ఈరోజుల్లో ఎంత పెద్ద స్టార్స్‌ చిత్రాలైనా ఒక వారం, రెండు వారాలకు మించి ఎక్కువ కలెక్షన్లు రాబట్టలేవని చాలామంది భావిస్తుంటారు. రెండో వారానికే పైరసీ సీడీలు వచ్చేస్తాయని, కాబట్టి మొదటి వారంలోనే ఆయా స్టార్స్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు. అందుకే తమ చిత్రాలను వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ చేస్తుంటారు. దీనికి టాలీవుడ్‌తో పాటు ఏ వుడ్‌ కూడా అతీతంకాదు. కానీ మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అయిన అమీర్‌ నటించిన 'దంగల్‌' చిత్రం మాత్రం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఐదో వారం అయిన కూడా స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్‌ఎనలిస్ట్‌లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 700కోట్లకు చేరువలో ఆగిపోతుందని భావించారు. ఇప్పటివరకు వరల్డ్‌వైడ్‌గా అమీర్‌ నటించిన 'పీకే'చిత్రం సాధించిన 798కోట్లను అందుకోలేదని అంచనాలు వేశారు. కానీ ఆ ఆలోచనలను దంగల్‌ తిరగరాస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 735కోట్లను దాటింది. ఈ చిత్రం మరో వారం పాటు స్టడీగా నడిస్తే ప్రపంచవ్యాప్తంగా 800కోట్ల గ్రాస్‌ను, 400కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేయడం గ్యారంటీ అంటున్నారు. మరోపక్క కింగ్‌ఖాన్‌ షారుఖ్‌ఖాన్‌ నటించిన 'రాయిస్‌', గ్రీకువీరుడు హృతిక్‌రోషన్‌ నటిస్తున్న 'కాబిల్‌' చిత్రాలు పోటాపోటీగా విడుదల కానున్నాయి. మరి ఇప్పటివరకు మరో పెద్ద చిత్రం విడుదల కాకపోవడం 'దంగల్‌'కి కలసి వచ్చిందని, కానీ రేపటి నుంచి 'రాయిస్‌, కాబిల్‌'ల జోరును 'దంగల్‌' అడ్డుకోలేకపోవచ్చని ట్రేడ్‌పండితులు భావిస్తున్నారు. మరి ఈ సారైనా వీరి లెక్కలు నిజమవుతాయో? లేదో వేచిచూడాల్సివుంది...!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ