తెలుగులో విశాల్ హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించిన 'ఒక్కడొచ్చాడు' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం దర్శకుడు సూరజ్ ఈ చిత్రం విడుదలైన తర్వాత చేసిన వ్యాఖ్యలు పలు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. హీరోలకు ఎక్కువగా క్రేజ్ ఉంటుంది కాబటి కోట్లు ఇస్తాం.. మరి హీరోయిన్లు కూడా కోట్లు తీసుకుంటున్నారు కదా...! కాబట్టి వారు కిందిస్థాయి ఆడియెన్స్‌ను రంజింపజేసేలా కాస్ట్యూమ్స్ వేసుకోవాలి. అంతేకానీ మేము వేసుకోం.. అంటే నేనొప్పుకోను అని ఈ దర్శకుడు వ్యాఖ్యానించాడు. దీనిపై తమన్నా, నయనతారలతో పాటు హీరో రానా, విశాల్ వంటి వారు కూడా తీవ్ర విమర్శలు చేసి, చివరకు సూరజ్ చేత క్షమాపణ చెప్పించారు.
తాజాగా ఇవే వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. హాట్ హీరోయిన్ శృతిహాసన్ మాట్లాడుతూ... అందాల ఆరబోత తప్పుకాదు.. కమర్షియల్ సినిమాలకు గ్లామర్ ముఖ్యం. మోడ్రన్‌కాలంలో గ్లామరస్‌గా కనిపించడం హీరోయిన్లకు ముఖ్యం. డబ్బు తీసుకుంటున్నప్పుడు అలాంటివి చేయకతప్పదు అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. ఇవి సూరజ్‌కు మద్దతు పలికే విధంగా ఉన్నాయని చాలామంది హీరోయిన్లు శృతిపై గుర్రుగా ఉన్నారు. కాగా ప్రముఖ తెలుగు నిర్మాత దిల్‌రాజు ఓ చానెల్‌లో మాట్లాడుతూ, ఇన్‌డైరెక్ట్‌గా సూరజ్ వ్యాఖ్యలను ఖండించాడు. హీరోయిన్లకు డబ్బులిచ్చేది యాక్టింగ్ చేయించుకోవడానికే తప్ప.. గుడ్డలిప్పి చూపించడానికి కాదు... అవసరానికి తగ్గట్లు అలా కొన్ని సీన్స్‌లో వేసుకోవాల్సివస్తుందనేది వాస్తవమే. కానీ డబ్బులిస్తున్నాం.. కాబట్టి అలా వేసుకోవాల్సిందే అనడం కరెక్ట్ కాదు.. అంటూ సూరజ్ వ్యాఖ్యలను ఇన్‌డైరెక్ట్‌గా తప్పుబట్టారు. మొత్తానికి ఈ వివాదం ఇప్పుడు కోలీవుడ్‌లో శృతి, తెలుగులో దిల్‌రాజు పుణ్యమా...! అని మరోసారి చర్చల్లోకి వచ్చింది.