తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఎంతగా ఉదృత రూపం దాల్చిందో తెలిసిన విషయమే. ఈ ఉద్యమానికి సినీతారలు సైతం రోడ్డెక్కి నిరసనలు తెలియజేసారు.అయితే జల్లికట్టు పై ఉన్న బ్యాన్ ని ఎత్తేసి ఆర్డినెన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందిగాని.. తమిళులు మాత్రం కేవలం ఆర్డినెన్సు సరిపోదు... మాకు శాశ్వత పరిష్కారం కావాలని యువత మెరీనా బీచ్ లో ఆందోళనలు ఉదృతం చేసిన నేపథ్యం లో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసిమరీ గుంపులను చెదరగొట్టి మెరీనా బీచ్ ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.
ఇక తమిళ స్టార్స్ లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వారిలో ముందుగా లారెన్స్ ఉండగా ఆ తర్వాత లోకనాయకుడు కమల్ హాసన్ ఉన్నాడు. కమల్ కూడా జల్లికట్టును సమర్ధిస్తూ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చెయ్యడమే కాక పోలిసుల దౌర్జన్యాలను వారు లాఠీ ఛార్జ్ చేసిన వీడియో ఒకదానికి కమల్ బయట పెట్టాడు. పోలీస్ లు ఆటోలకు నిప్పు పెట్టి అల్లర్లకు కారణమైన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ లా పాకిపోయింది. పోలీసులే ఇలా వాహనాలను తగలబెట్టడాన్ని చూసి తాను షాక్ అయ్యానని కమల్ అంటున్నాడు.మరి ఈ వీడియోపై పోలీసులు అధికారులు స్పందిస్తారని తాను భావిస్తున్నాని అన్నారు.