Advertisementt

విశ్రాంతి లేదు... విరామం లేదు...!

Tue 24th Jan 2017 06:04 PM
heroine amalapaul,amalapaul husband director vijay,rajinikanth,dhanush,item song chance get amalapaul  విశ్రాంతి లేదు... విరామం లేదు...!
విశ్రాంతి లేదు... విరామం లేదు...!
Advertisement
Ads by CJ

ఇది ఓ హీరోయిన్‌కు బాగా సూట్‌ అవుతుంది. ఆమె ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన అమలాపాల్‌. ఆమె కెరీర్‌ను పెళ్లికి ముందు... విడాకుల తర్వాత అని విభజించుకోవచ్చు. ఆమె పెళ్లికి ముందు పలు స్టార్స్‌చిత్రాలలో చేసినప్పటికీ పెద్దగా బిజీ కాలేదు. కానీ దర్శకుడు విజయ్‌ని పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం ఆమె అనూహ్యంగా బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె దక్షిణాదిలో తెలుగులో తప్ప మిగిలిన అన్ని భాషా చిత్రాలలో నటిస్తోంది. రజనీకాంత్‌ నుంచి ధనుష్‌ వరకు అందరితో జోడీ కడుతోంది. ప్రస్తుతం ఆమె అరడజనుకు పైగా చిత్రాలలో నటిస్తూ.. విరామం లేకుండా.. విశ్రాంతి లేకుండా బిజీ కావడం సినీ విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

తాజాగా ఈ అమ్మడు మరో కీలకనిర్ణయం తీసుకుంది. తమన్నా, కాజల్‌, శృతిహాసన్‌ల తరహాలో ట్రెండ్‌ను ఫాలోఅవుతూ ఐటం గర్ల్‌గా కూడా మారాలని నిర్ణయించుకుంది. తాజాగా ఆమె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్‌ చేయడానికి భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేయడంతో ఓకే చేసేసింది. దీంతో క్రేజ్‌ ఉండగానే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్న నిర్ణయం తీసుకుందని, ఆ విషయంలో ఆమెకు సన్నిహితుడైన తమిళ స్టార్‌ ధనుష్‌ కూడా ఇలాంటి అవకాశాలను కూడా వదులుకోవద్దని ఆమెకి అమూల్యమైన సలహా ఇచ్చాడట. ఇక ఈ పాట బాగా హిట్‌ అయితే ఇక ఈ భామకు ఐటమ్స్‌ కూడా వెల్లువెత్తడం ఖాయమంటున్నారు. మొత్తానికి ఆమె విడాకులు తీసుకున్న వేళా విశేషం బాగా ఉందనే సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ