Advertisementt

అనుపమ పై ఈ న్యూస్ నిజమేనా...?

Tue 24th Jan 2017 12:15 PM
anupama parameswaran,miss chances,ram charan and sukku movie,nani and venu sriram movie  అనుపమ పై ఈ న్యూస్ నిజమేనా...?
అనుపమ పై ఈ న్యూస్ నిజమేనా...?
Advertisement
Ads by CJ

నిన్నటిదాకా లక్కీగాళ్ అని మోసేసిన అనుపమ పరమేశ్వరన్  ఉన్నట్టుండి అన్ లక్కీ అయిపోయిందట. అసలు విషయం ఏమిటంటే అనుపమ 'అఆ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఫుల్ మార్కులు వేయించుకున్న అనుపమకు 'ప్రేమమ్' లో నాగ చైతన్య సరసన ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమాలతో గ్లామర్ జోలికి వెళ్లకుండా పద్దతిగల తెలుగింటి ఆడపిల్లలా వున్న అనుపమకు దిల్ రాజు నిర్మించిన 'శతమానం భవతి'లో శర్వానంద్ పక్కన జోడి కట్టిన అనుపమకు లక్కీ గర్ల్ అని పేరు వచ్చేసింది. నటించిన మూడు సినిమాలు హిట్ అవడంతో అనుపమకు ఇక టాలీవుడ్ లో ఎదురులేదనుకున్నారు అంతా.

ఇక అనుపమ పరమేశ్వరన్ కు రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కే ప్రేమ కథా చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా పల్లెటూరి అమ్మాయిగా ఛాన్స్ వరించింది. అటు రామ్ చరణ్ పక్కనే కాకుండా నాని పక్కన కూడా వేణు శ్రీరాం డైరెక్షన్ లో రాబోయే సినిమాలో కూడ హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలొచ్చాయి. ఇంకేమిటి అనుపమకు అదృష్టం పట్టి ఇలా ఛాన్స్ ల మీద ఛాన్స్ లు వస్తున్నాయని అందరూ అనుకుంటున్న తరుణంలో.... అనుపమ చెయ్యబోయే అప్ కమింగ్ మూవీస్ లో ఛాన్స్ కోల్పోయిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హల్ చల్ చేస్తుంది.

కారణం ఏమిటనేది తెలియదు గాని రామ్ చరణ్ - సుకుమార్ మూవీ లో అనుపమని తప్పించినట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఇక అనుపమ స్థానంలో ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేస్తారని సమాచారం. అలాగే నాని పక్కన కూడా ఛాన్స్ పోయిందని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో అనుపమ నటించడంలేదనే టాక్ వినబడుతుంది. మరి ఉన్నట్టుండి అనుపమ కి ఈ రెండు పెద్ద ఛాన్స్ లు చేజారిపోవడం వెనుక ఎవరన్నా... ఉన్నారా ? లేక......? అనేది మాత్రం తెలియాల్సి వుంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ