Advertisementt

రాయబారితో మెగా కాంపౌండ్ లోకి దర్శకుడు..!

Tue 24th Jan 2017 11:29 AM
director krish,gautamiputra satakarni movie,ram charan,krish and ram charan combination movie,rayabari movie coming soon  రాయబారితో మెగా కాంపౌండ్ లోకి దర్శకుడు..!
రాయబారితో మెగా కాంపౌండ్ లోకి దర్శకుడు..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ క్రిష్ ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు. బాలకృష్ణకి 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి హిట్ ఇచ్చిన క్రిష్ పై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలు క్రిష్ తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ డిఫ్రెంట్ డిఫ్రెంట్ కథలతో తీసినవే. ఒక్కో సినిమాకి ఒక్కొకథ, ఒక్కో పంథాతో తీస్తూ పోయాడు. అయితే క్రిష్ 'కంచె' చిత్రం జాతీయ అవార్డు గెలుచుకున్న తర్వాత మళ్లీ వరుణ్ తేజ్ ని హీరోగా పెట్టి 'రాయబారి' సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ ఎందువలనో ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే ఆ చిత్రానికి పెట్టుకున్న బడ్జెట్ ఎక్కువ కావడం వలెనే ఆ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. 

గూఢచర్యం నేపథ్యంలో... యాక్షన్ ఓరియెంటెడ్ గా ఈ చిత్రాన్ని క్రిష్ తెరకెక్కించాలనుకున్నాడు. అందుకే భారీ బడ్జెట్ తో యుద్ధ, యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన క్రిష్ కి బడ్జెట్ అనుకూలించక ఆ చిత్రం పట్టాలెక్కలేదనే ప్రచారం జరిగింది. ఇక ఈ సినిమాకి ఎంతో ఇష్టపడి 'రాయబారి' అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసుకున్న క్రిష్ ఆ సినిమాని పక్కన పెట్టేసి బాలకృష్ణ తో 'గౌతమిపుత్ర శాతకర్ణి'ని పట్టాలెక్కించి హిట్ కొట్టాడు. అయితే క్రిష్ అనుకున్న ఆ రాయబారి ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కుతుందని... అనుకున్న హీరో కూడా మారిపోయాడనే వార్తలు ఫిలింనగర్ స్కిల్స్ లో వినబడుతున్నాయి. 

ఒక హీరోకి అనుకున్న కథని మరో హీరోతో సినిమా తెరకెక్కించడం చూస్తూనే వున్నాం. ఇక ఇక్కడ క్రిష్ కూడా తాను వరుణ్ తేజ్ కి రాసుకున్న కథతో రామ్ చరణ్ తో తియ్యబోతున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ కథతో రామ్ చరణ్ ని క్రిష్ కలిసినట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఆ 'రాయబారి' స్టోరీ విన్న చరణ్ ఇంప్రెస్స్ అయ్యి ఆ చిత్రంలో నటిస్తానని... అవసరమునుకుంటే ఆ చిత్రాన్ని తానె నిర్మిస్తానని క్రిష్ కి మాట ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది. బడ్జెట్ కోసం బెంగ వద్దని... నేనున్నానని చరణ్, క్రిష్ కి హామీ ఇచ్చినట్లు టాక్. అలాగే రామ్ చరణ్, సుకుమార్ సినిమా కంప్లీట్ అయ్యాక.... క్రిష్, వెంకీ ని డైరెక్ట్ చేసే సినిమా పూర్తయ్యాక ఈ  క్రిష్ - చరణ్ కాంబినేషన్ లో 'రాయబారి' ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ