Advertisementt

ఐటెం సాంగ్స్ పై దృష్టి పెట్టిన హీరోయిన్..!

Mon 23rd Jan 2017 06:44 PM
heroines,hamsa nandini,anchor ashmi,anusuya,lakshm raai,raj tarun,kittu unnadu jagratha movie  ఐటెం సాంగ్స్ పై దృష్టి పెట్టిన హీరోయిన్..!
ఐటెం సాంగ్స్ పై దృష్టి పెట్టిన హీరోయిన్..!
Advertisement
Ads by CJ

ఈ మధ్యన హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ కి సై అంటున్నారు. తమన్నా అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రెండు చిత్రాలలోనూ ఐటెం సాంగ్ లో ఆడిపాడింది. ఇక శృతి హాసన్ మహేష్ చిత్రం 'ఆగడు'లో ఐటెం లో మెరిసింది. ఇక తాజాగా కాజల్ కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది. ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్' లో కాజల్ 'నేను పక్కా లోకల్' అంటూ స్పెషల్ సాంగ్ లో రెచ్చిపోయి డాన్స్ చేసింది. మరో పక్క లక్ష్మి రాయ్ పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్సింగ్' లో ఐటెం సాంగ్ లో ఆడిపాడి మంచి పేరు కొట్టేసింది. అలాగే అన్నయ్య చిరు తాజా చిత్రం 'ఖైదీ నెంబర్ 150' లో 'రత్తాలు... రత్తాలు' అంటూ రెచ్చిపోయి చిరు పక్కన నాట్యం చేసింది.

ఇక వీరంతా మంచి జోరుమీదుండగా.. అడపా దడపా  హీరోయిన్ గా చేసి ఐటెం పాపగా స్థిరపడిన హంసా నందిని.....  'మిర్చి, అత్తారింటికి దారేది' వంటి చిత్రాలలో ఐటమ్స్  సాంగ్స్ లో మెరిసింది. మరోమారు  హంసాకి కుర్ర హీరో రాజ్ తరుణ్ పక్కన 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త'లో ఐటెం పాపగా అవకాశం వచ్చింది. ఇక అవకాశంతో రెచ్చపోయిన హంసానందిని లుక్ ని మీరు ఒకసారి చూడండి. హీరోయిన్ గా అవకాశాలు ఎటూ రావడంలేదు కనీసం ఐటెం పాపగా అయినా మంచి గుర్తింపు పొందాలని హంసానందిని ఆరాట పడుతున్నట్టు లేదు ఈ ఫోటో చూస్తుంటే. ఇక హీరోయిన్సే ఐటెం సాంగ్స్ లో ఆడిపాడుతుంటే మరోపక్క యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ లు కూడా ఐటమ్స్ సాంగ్స్ పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ