టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ కి టాటా చెప్పేసింది గోవా బ్యూటీ ఇలియానా. ఎదో ఒకటి అరా తెలుగు చిత్రాలలో నటించిన ఆమె పూర్తి స్థాయిలో తెలుగులో నిలబడలేకపోయింది. అప్పుడుడప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ లా మారి నిత్యం వార్తల్లోకెక్కే ఇలియానాకి ఆ మధ్యన పెళ్లి కూడా అయిపోయిందనే పుకారు పుట్టించారు. ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తరచూ మీడియాకి చిక్కే ఇలియానాకి బాలీవుడ్ లో కూడా ఆశించిన అవకాశాలు లేక డీలా పడింది. ఇక సినిమాల్లో సరిగ్గా అవకాశాలు లేని ఇల్లీ బేబి తన పర్సనల్ వీడియోస్ ని యూటుబ్స్ లో పెడుతూ కాలం వెళ్లబుచ్చుతుంది.
ఆ మధ్యన స్విమ్మింగ్ ఫూల్ లో సెమి న్యూడ్ తో ఈతకొట్టే వీడియో పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇలియానా ఇప్పుడు పూర్తి న్యూడ్ తో ఉన్న ఒక ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒంటి మీద నూలుపోగు లేకుండా బాత్ టబ్ లో పడుకున్న ఇలియానాని ఆమె బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కెమెరాలో బందించాడట. ఇంకేముంది వెంటనే ఇలియానా ఆ పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసింది. ఎప్పుడూ వివాదాలకు అతి దగ్గరగా ఉండే ఈ గోవా బ్యూటీ ఇలియానా ఈ ఫొటోతో మళ్ళీ ఏ వివాదాన్ని కొని తెచ్చుకుంటుందో? అని అందరూ తెగ ఇదైపోతున్నారంటే నమ్మండి.