Advertisementt

అమ్మాయిల విషయం మాత్రం చెప్పలేదు..!

Mon 23rd Jan 2017 03:43 PM
subbirami reddy,aswini dutt,chiranjeevi 151 movie,maltistarar movie,ram charan,allu arjun,pawan kalyan  అమ్మాయిల విషయం మాత్రం చెప్పలేదు..!
అమ్మాయిల విషయం మాత్రం చెప్పలేదు..!
Advertisement
Ads by CJ

తొమ్మిదేళ్ల గ్యాప్ తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరు తన స్టామినా ఏంటో 'ఖైదీ నెంబర్ 150' తో మరోసారి నిరూపించాడు. కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ దుమ్ముదులుపుతున్న 'ఖైదీ....' చిత్రం కొత్త రికార్డులని సృష్టించే పనిలో పడింది. ఇక 'ఖైదీ...' చిత్రం 150వ సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంటే మరో పక్కన చిరు 151  చిత్రానికి సంబందించిన  ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్ గా చేస్తుండగా రామ్ చరణ్ మళ్ళీ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. ఇదిలా ఉండగా మొన్నామధ్యన 'ఖైదీ నెంబర్ 150' చిత్రం సక్సెస్ సాధించిన సందర్భంగా టి సుబ్బిరామి రెడ్డి ఒక సక్సెస్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ ఫంక్షన్ లో సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... మెగా ఫ్యామిలితో ఒక మల్టీస్టారర్ చిత్రాన్ని తానె నిర్మిస్తానని చెప్పాడు. అయితే ఏదో మెగా ఫ్యాన్స్ కి బూస్ట్ ఇవ్వడానికే సుబ్బిరామిరెడ్డి అలా చెప్పేడేమో అని అందరూ లైట్ తీసుకున్నారు.

అయితే ఈ మెగా మల్టీస్టారర్ కి సంబందించిన చిత్రాన్ని సుబ్బిరామిరెడ్డి, అశ్వినీదత్ తో కలిసి నిర్మించబోతున్నాడట . ఇక ఈ మెగా మల్టీస్టారర్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఉంటారని సుబ్బిరామిరెడ్డి చెప్పాడు. మరి అమ్మాయిల విషయం మాత్రం చెప్పలేదు. మెగా డాటర్ నిహారిక ఇప్పటికే సినిమా హీరోయిన్ అయ్యి కూర్చుంది. మరి మెగా డాటర్ కి కూడా ఈ మెగా మల్టిస్టారర్ లో చోటు దక్కుతుందో లేక? అనేది సస్పెన్సు.  ఇక ఈ మెగా మల్టీస్టారర్ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా... అని మెగా అభిమానులు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాచుకు కూర్చున్నారు. అసలు ఈ సినిమా పట్టాలెక్కలే గాని మొదలైన మొదటి రోజు నుండే ఈ సినిమా పై భారీ అంచనాలతో పాటే కలెక్షన్స్ సునామి మొదలై పోతుంది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ