Advertisementt

నాగ్ సర్ అంటే ఒప్పుకోడట..!

Mon 23rd Jan 2017 02:11 PM
akkineni nagarjuna,naga chaitanya,akhil,shreya bhupal,samantha  నాగ్ సర్ అంటే ఒప్పుకోడట..!
నాగ్ సర్ అంటే ఒప్పుకోడట..!
Advertisement
Ads by CJ

సమంత - నాగ చైతన్య, అఖిల్ - శ్రీయా భూపాల్ ల పెళ్లిళ్లు నిశ్చయమై పోయాయి. ఇప్పటికే అఖిల్ - శ్రియా భూపాల్ నిశ్చితార్ధం కూడా జరిగిపోయింది. వీరి పెళ్లి వచ్చే మే లో ఇటలీలో కొంతమంది సన్నిహితుల మధ్యన జరగనున్నదని  నాగార్జున చెబుతున్నాడు. ఇక మరో జంట నాగ చైతన్య - సమంతల నిశ్చితార్ధం కూడా ఈ నెల 29 న జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉండగా నాగార్జునకి కాబోయే కోడళ్ళు తనని ఎలా పిలుస్తారో అని నాగ్ తెగ ఆలోచిస్తున్నాడట.  

అదే అఖిల్ కి కాబోయే వైఫ్ శ్రీయ భూపాల్ అయితే మొదటినుండి నాగార్జున ఫ్యామిలీతో క్లోజ్ కాబట్టి చిన్నప్పటి నుండి 'నాగ్ మామ' అని పిలుస్తుంటుందట. అంటే అఖిల్ తో పెళ్లైయ్యాక కూడా శ్రియా భూపాల్ నాగార్జునని 'నాగ్ మామ' అనే పిలుస్తుంది కాబట్టి నాగ్ కి ప్రాబ్లం లేదు. ఇక సమంత విషయానికి వస్తే నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న తర్వాత నాగార్జునని ఎలా పిలుస్తుందో అని అనుకుంటున్నారట అందరూ. ఇప్పటివరకు అయితే సమంత నాగార్జునని  'నాగ్ సర్' అని మాత్రమే పిలిచేదట. కానీ పెళ్లయ్యాక అలా 'నాగ్ సర్' అంటే ఊరుకోనని  చెబుతున్నాడు నాగార్జున. మరి సమంత పెళ్లైయ్యాక నాగార్జునని ఎలా పిలుస్తుందో అని నాగార్జునతో పాటే మిగతా చాలామంది వెయిట్ చేస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ