Advertisementt

సూర్య ఘాటుగా స్పందిస్తున్నాడు..!

Mon 23rd Jan 2017 12:36 PM
tamil nadu,jallikattu,justice for jallikattu,hero suriya,mahesh babu,pawan kalyan,s 3 movie  సూర్య ఘాటుగా స్పందిస్తున్నాడు..!
సూర్య ఘాటుగా స్పందిస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

తమిళనాడులో కొనసాగుతున్న జలికట్టు మద్దతు ఉద్యమం మొత్తానికి విజయవంతం అయింది. కాగా ఈ ఉద్యమానికి తమిళ సినీలోకం కూడా మద్దతునిచ్చింది. ఈ ఉద్యమంలో స్టార్‌ సూర్య, ఆయన తమ్ముడు హీరో కార్తి కూడా యాక్టివ్‌గా పాల్గొన్నారు. కాగా జల్లికట్టును వ్యతిరేకిస్తున్న జంతు సంరక్షణ సంస్థ పెటా సూర్య చర్యలను వ్యక్తిగతంగా తప్పుపట్టింది. తాను హీరోగా నటించబోయే 'సింగం 3' చిత్రం కోసమే సూర్య ఇలా పనిగట్టుకుని వ్యక్తిగత స్వార్థంతో ఈ ఉద్యమానికి మద్దతు తెలిపాడని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. 

దాంతో మండిపడ్డ సూర్య పెటా సంస్థ సీఈవోలకు లీగల్‌నోటీసులు పంపాడు. ఇప్పుడు ఈ విషయం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే తమిళ సినీ నటులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పవన్‌, మహేష్‌లు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. మొత్తానికి ఈ ఉద్యమం విజయవంతం కావడంతో తమిళుల సంఘటిత పోరాటినికి దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. కానీ ఈ విషయంలో ప్రజలను విజ్ఞానవంతులని చేసి, మూఢసంప్రదాయాలపై చైతన్యం చేయాల్సిన సినీప్రముఖులు సైతం ప్రజల్లో తమ పరపతిని పెంచుకోవడానికి ఇలాంటి వికృతక్రీడకు మద్దతు తెలపడంపై జంతుసంరక్షణ సంస్థలు, సామాజిక ఉద్యమకారులు, మేథావులు మాత్రం తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ