రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి తెలియని వారుండరు. ఆయన గొప్ప రైటర్ మాత్రమే కాదు ఒక దర్శకుడు కూడా. అలాంటి విజయేంద్ర ప్రసాద్ కి టాలీవుడ్ వెబ్సైట్ కోపం తెప్పించాయంటా. ఎందుకంటే చాలాకాలం నుండి రాజమౌళి మహాభారతాన్ని తెరకెక్కిస్తాడని సోషల్ మీడియాలో, వెబ్సైట్ లో ఒకటే ప్రచారం జరుగుతుంది. 'బాహుబలి' విడుదలైన తర్వాత రాజమౌళి తెరకెక్కించబోయే మరో అద్భుత కావ్యం 'మహాభారతం' అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే రాజమౌళి డైరెక్షన్ లో 'మహాభారతం' తెరకెక్కుతుందనే వార్తలపై రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్పందించారు. అసలు నేను కథ రాసేటప్పుడుగాని, రాజమౌళి కథ రాసేటప్పుడు గాని ఎవరన్నా మా దగ్గరికి వచ్చి చూస్తున్నారా... లేకపోతె ఏమిటి ఇలాంటి కల్పితాలు సృష్టించాల్సిన అవసరం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు మహాభారతాన్ని తెరకెక్కించే ఆలోచన రాజమౌళికి గాని తనకి గాని లేదని... ఇలాంటి కల్పితాలు రాసుకుని వెబ్సైట్ తమ పని కానిచ్చేసుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇక రాజమౌళి ప్రతి ఒక్క సెకను 'బాహుబలి' గురించే ఆలోచిస్తున్నాడని.... ఆ సినిమా రిలీజ్ ఏప్రిల్ 28న అని ప్రకటించినప్పటినుండి రాజమౌళి దృష్టాంతా 'బాహుబలి' మీదే ఉందని... అలాంటి సమయంలో రాజమౌళికి 'మహాభారతం' గురించి ఆలోచించే టైమే లేదని కుండబద్దలు కొట్టాడు. మరి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే స్వయంగా 'మహాభారతం' తియ్యడం లేదని చెప్పాక ఇక వెబ్సైట్ మాత్రం ఏం చేస్తాయి..... సైలెంట్ అవ్వడం తప్ప.