Advertisementt

పాపం హీరోయిన్‌ ఆవేదన పట్టించుకునేవారేలేరా...!

Sun 22nd Jan 2017 05:30 PM
heroine ramba,ramba love marriage,ramba husband indran,two daughters  పాపం హీరోయిన్‌ ఆవేదన పట్టించుకునేవారేలేరా...!
పాపం హీరోయిన్‌ ఆవేదన పట్టించుకునేవారేలేరా...!
Advertisement
Ads by CJ

మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు అగ్రహీరోల సరసన నటించిన నిన్నటితరం టాప్‌ హీరోయిన్‌ రంభ. కాగా ఆమె సినిమాలలో మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే కెనడాకు చెందిన బిజినెస్‌మేన్‌ ఇంద్రన్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. 2010 ఏప్రిల్‌లో వీరి వివాహం జరిగింది. ఆరేళ్లు బాగానే కాపురం సాగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. కానీ ఆ తర్వాత భర్తతో విభేదాలు వచ్చి ఇద్దరు పిల్లలను తీసుకుని ఇండియా వచ్చి చెన్నైలో పిల్లలతో ఉంటోంది. వీరిద్దరు గతంలోనే విడాకుల కోసం అప్లై చేశారు. కానీ తాజాగా రంభ యూటర్న్‌ తీసుకుంది. తనకు తన భర్తతో కలిసి జీవించాలని ఉందని, లేని పక్షంలో నెలకు రెండున్నరలక్షల భరణం ఇప్పించాలని కోరింది. 

ఇంద్రన్‌ని ఎంతో ప్రేమించాను. ఆతనే నా సర్వస్వం అని నమ్మాను, కానీ మా అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. నా పేరు మీద ఉన్న ఆస్తిని కూడా వారికి రాసివ్వమని వేధింపులకు గురిచేశారు. అయిన ఓర్చుకున్నాను. ఇక నా పెద్ద కూతురిని నేనే కిడ్నాప్‌ చేశానని కేసు పెట్టారు. దాంతో నా మనస్సు విరిగిపోయింది. అప్పుడు మా రెండో పాప నెలల బిడ్డ. ఇక ఆ వేదింపులు తట్టుకోలేక ఇద్దరు చంటిపిల్లలను తీసుకొని ఒంటరిగా చెన్నై వచ్చేశాను. సినిమా పరిశ్రమ మరలా నన్ను ఆదరిస్తుందని భావించాను. కానీ అది జరగలేదు. ఇప్పుడు నా భర్తతో కలిసి ఉండాలనుకుంటున్నాను.లేకపోతే నాకు నెలకు భరణం ఇప్పించండి. అది కూడా నా కోసం కాదు..నా పిల్లల కోసం అంటూ చెప్పుకొచ్చింది. తమ భార్యాభర్తల మద్య సయోధ్య కుదిరించే వారు లేకపోగా, మా మధ్య చిచ్చుపెట్టేవారే ఎక్కువగా ఉన్నారని ఆవేదన వెలిబుచ్చింది. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ