దర్శకత్వశాఖలో బాపు, రాఘవేంద్రరావు వంటి వారి వద్ద పనిచేసి డైరెక్టర్ కావాలనుకొని అనుకోకుండా నటునిగా మారాడు నాని. ఇక ప్రస్తుతం హీరోగా దుమ్ముదులుపుతున్నాడు. సినిమాల విషయంలో నాని దర్శకత్వంలో పెద్దగా వేలుపెట్టడు గానీ, ప్రమోషన్ విషయంలో మాత్రం ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకుని, దర్శకనిర్మాతలు ఒప్పిస్తుంటాడు. అందుకే ఆయన హీరోగా నటించిన చిత్రాల ప్రమోషన్లు డిఫెరెంట్‌గా ఉండి, విడుదలకు ముందే అందరిలో క్యూరియాసిటీ కలిగిస్తుంటాయి. ఇవన్నీ నాని సొంత ఆలోచనలు, స్క్రిప్ట్‌లే కావడం విశేషం. తాజాగా ఆయన 'నేను.. లోకల్' చిత్రం పబ్లిసిటీ విషయంలో కూడా తన వెరైటీ మార్కును చూపిస్తున్నాడు.
ఈ చిత్రంలోని ట్రైలర్‌లోని ఓ పాపులర్ డైలాగును పేరడీ చేస్తూ.... 'ఈ సినిమా చూడటానికి ఒక్క రీజన్ మీరు అడుతారేమో? కానీ ఈ సినిమా ఎందుకు చూడకూడదో మీరు ఒక్క రీజన్ నాకు చెప్పమంటూ.. క్యాలెండర్‌లో విడుదల తేదీ ఫిబ్రవరి3ను చూపిస్తూ నాని తీసిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. కాగా గత ఏడాది హ్యాట్రిక్ కొట్టిన నాని ఈ ఏడాదిని 'నేను..లోకల్'తో ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి14న 'శతమానం భవతి' ద్వారా పెద్ద హిట్ కొట్టిన నిర్మాత దిల్‌రాజు నెల రోజులలోపే మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంటానని ఎంతో నమ్మకంగా ఉన్నాడు. ప్రస్తుతం సౌత్ ఇండియాను ఆకర్షిస్తోన్న కీర్తిసురేష్ నటించడం, దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్స్, 'సినిమా చూపిస్త మావా...' తరహాలో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో తన రెండో చిత్రంగా వస్తున్న దర్శకుడు త్రినాధరావు నక్కిన తదితరులు ఈ చిత్రానికి అదనపు అండగా నిలవనున్నారు.