ఒకప్పుడు సినిమా నిర్మాతలు తమ చిత్రం ఇంత కలెక్ట్ చేసిందంటే... అంత కలెక్ట్ చేసిందని ప్రకటనలు గుప్పించేవారు. ఇక స్టార్‌హీరోల చిత్రమైతే ఆచిత్రం ఎంత వసూలు చేస్తోందని నిర్మాతలతో పాటు టెక్నీషియన్స్, అభిమానులతో పాటు ఇతర హీరోలు, వారి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ఈమధ్య ఇలాంటి చిత్రాల విషయంలో ఐటీ దాడులు ఎక్కువయ్యాయి. 'దూకుడు' తర్వాత 14 రీల్స్ సంస్థపై, 'బాహుబలి' తర్వాత ఆర్కామీడియాపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో తమ చిత్రాల కలెక్షన్ల వివరాలను బయటపెట్టేందుకు నిర్మాతలు జంకుతున్నారు. ఇక మోదీ నల్లధనంపై ఉక్కుపాదం మోపిన తర్వాత ఈ పరిస్థితి మరింత ఎక్కువైంది, సినిమా నిర్మాణాలలో ఎక్కువగా బ్లాక్‌మనీనే హల్‌చల్ చేయడమనేది అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఎవరూ కలెక్షన్ల విషయంలో పెద్దగా నోరు విప్పడం లేదు.
కానీ చిరంజీవి నటించిన 150వచిత్రం కలెక్షన్లను ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయింది. ఈ చిత్రం మొదటి వారంలోనే 100కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ప్రకటించారు. దీంతో ఈ చిత్రంలో నటించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్లు తమ తమ పారితోషికాలు ఎంత? అనే విషయంలో ఐటీ దాడులు జరుగుతాయేమోనని భయపడిపోతున్నారట. కానీ ఈ చిత్రం నిర్మాణం, బిజినెస్.... అలా అన్ని విషయాలలోనూ అంతా పారదర్శకంగా వ్యవహించారు కాబట్టే ఈ చిత్రం కలెక్షన్లను బహిరంగంగా ప్రకటించారనే వాదన కూడా తెరపైకి వస్తోంది. ఇప్పుడు చిరు అంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌కు గానీ, ఏపీ సీఎం చంద్రబాబుకు గానీ ప్రధాన టార్గెట్ అని, ఇప్పటికే 'శాతకర్ణి' చిత్రం విషయంలో ఇరు రాష్ట్రాలు కాస్త తెగించి మరీ వినోదపు పన్ను మినహాయించారని, అలాంటి సమయంలో వారు చిరుని, మెగాక్యాంపుని టార్గెట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.