యంగ్‌టాలెంట్‌ను ప్రోత్సహించడం, సక్సెస్‌ఫుల్ దర్శకుల వెంట పడకుండా తనకు నచ్చిన దర్శకులతో పనిచేయడం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నైజం. కాగా ఆయన 'గోపాలా.. గోపాలా' చిత్రంలో విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఓ కీలకపాత్రలో నటించాడు. ఆచిత్రం ఆడియో వేడుక సందర్భంగానే ఆ చిత్ర దర్శకుడు డాలీకి, సంగీత దర్శకుడు అనూప్‌రూబెన్స్‌లకు తాను త్వరలో మరో అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ ఇటు రాజకీయాల్లో బిజీ కావడం వల్ల.. ఆయనతో చిత్రాలు చేయడానికి దాసరితో పాటు పలువురు లైన్‌లో ఉన్న దృష్ట్యా ఇది జరిగే పని కాదేమో అని చాలా మంది భావించారు. కానీ ఒక్కసారి మాట ఇస్తే నిలబెట్టుకునే దాకా నిద్రపోని తత్వం తనదని, తనను నమ్మిన వారిని ఎప్పటికీ వదలని పవన్ నిరూపించుకున్నాడు. అందులో భాగంగానే డాలీకి, అనూప్‌రూబెన్స్‌కు ఒకేసారి ఒకే చిత్రంతో మరలా అవకాశం ఇచ్చాడు. 'కాటమరాయుడు'కు డాలీ దర్శకత్వం వహిస్తుండగా, అనూప్‌రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే పవన్ తన మాట నిలబెట్టుకున్నప్పటికీ సంగీత దర్శకుడు అనూప్ తన మాటను నిలబెట్టుకోలేకపోతున్నాడనే వార్త ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రానికి అనుకున్న సమయానికి ట్యూన్స్ ఇవ్వకుండా అనూప్ ఆలస్యం చేస్తుండటంతో పవన్ ఆయనపై మండిపడ్డాడని సమాచారం. ఇప్పటికీ ఈ చిత్రం ట్యూన్స్ కోసం తాను అనూప్‌కు కావాల్సినంత స్వేచ్ఛ, సమయం ఇచ్చినప్పటికీ అనూప్ మాత్రం మాటనిలబెట్టుకోవడం లేదని సమాచారం. ఈ చిత్రంతో పాటు దాదాపు ఆరేడు చిత్రాలకు ప్రస్తుతం అనూప్ సంగీతం అందిస్తున్నాడు. 'కాటమరాయుడు'తో సహా అన్ని చిత్రాలకు సమాంతరంగా పనిచేస్తుండటంతో ఆయన బిజీగా ఉండి, పవన్‌కిచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదంటున్నారు. అయితే పవన్ చిత్రం తనకు చాలా కీలకం కావడంతోనే ప్రతి ట్యూన్ కోసం ఆయన నెలలు వెచ్చిస్తున్నాడని, లేటైనా సరే.. లేటెస్ట్‌గాఉండే విధంగా ఈ చిత్రం ట్యూన్స్‌ను రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది. క్వాలిటీ కోసమే అనూప్ తపన అంటున్నారు. కాగా ఇప్పటివరకు ఈ చిత్రం కోసం అనూప్ అందించిన బాణీలు అదిరిపోతున్నాయట. సో... సాంగ్స్‌ను అనూప్‌కు వదిలేసి, రీరికార్డింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈచిత్రం బ్యాగ్రౌండ్ స్కోర్‌ని వేరే సంగీత దర్శకునితో చేయించే దిశగా ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది.