నేటితరం నిర్మాతల్లో దిల్‌రాజు టేస్టే వేరు. ఆయన తాను తీసే చిత్రాలలో ఎక్కువగా ప్రకాష్‌రాజ్, జయసుధలు ఉండేలా చూసుకుంటూ ఉంటాడు. 'బొమ్మరిలు'తో పాటు 'సీతమ్మవాకిట్లో...సిరిమల్లె చెట్టు' నుండి తాజాగా వచ్చిన 'శతమానం భవతి' చిత్రం వరకు ఆయన తన చిత్రాలలో వారిద్దరికి ఇంపార్టెంట్ రోల్స్ ఇస్తుంటాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను, మహిళాప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని వారిద్దరూ ఉండేలా చూసుకుంటాడు. కాగా ఇది ప్రస్తుతం సెంటిమెంట్ పరంగా కూడా బాగా కలిసివస్తోంది. తాజాగా 'శతమానం భవతి' చిత్రంలోని తన పాత్ర విషయంలో సహజనటి జయసుధ చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చింది. ఒకప్పుడు శ్రీదేవి, జయప్రదలతో పోటీ పడి మరీ సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ ఇలాంటి తన లాంగ్ కెరీర్‌లో దిల్‌రాజు చిత్రానికి ఆమె ఇచ్చిన కాంప్లిమెంట్ అద్భుతం అనిపించకమానదు. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, జయసుధలు కలిసి దర్శకరత్న దాసరినారాయణావు దర్శకత్వంలో చేసిన 'ప్రేమాభిషేకం' చిత్రం అజరామరం. ఆ చిత్రంలో జయసుధ ఓ వేశ్యపాత్రలో శ్రీదేవిని సైతం డామినేట్ చేసింది. మరలా ఇంతకాలం తర్వాత తనకు అంత మంచి పాత్ర 'శతమానం భవతి'లో వచ్చిందని జయసుధ ప్రశంసల వర్షం కురిపించింది. ఇది దిల్‌రాజు కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని మధురమైన కాంప్లిమెంట్‌గా చెప్పుకోవచ్చు.