టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న రాజమౌళి ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయ్యింది అంటే అది తనకు నచ్చితే మటుకు ఆ సినిమా తీసిన డైరెక్టర్ ని పొగడ్తలతో ముంచేత్తుతుంటాడు . తానొగొప్ప డైరెక్టర్ అయినప్పటికీ ఏ మాత్రం గర్వం లేకుండా తన తోటి డైరెక్టర్స్ ని మెచ్చుకుంటాడు. ఇక ఇప్పుడు రాజమౌళి 'గౌతమీపుత్ర శాతకర్ణి' ని తీసిన డైరెక్టర్ క్రిష్ ని సినిమా విడుదల రోజే చూసి మెచ్చుకోవడమే కాక ఆయనతో ఒక ఇంటర్వ్యూ కూడా చేసాడు. ఆ ఇంటర్వ్యూ ని చాల ఫన్నీ గా అంటే సరదగా చేసి క్రిష్ ని గొప్ప డైరెక్టర్ అని కొనియాడాడు.
అసలు రాజమౌళికి క్రిష్ - బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా వస్తుంది అంటే అస్సలు నమ్మాలనిపించలేదట. ఎందుకంటే బాలకృష్ణేమో మాస్ అంటూ తొడలు చరుస్తాడు. ఇక క్రిష్ ఏమో మంచి సందేశాత్మక చిత్రాలు చేస్తూ క్లాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. అందుకే రాజమౌళికి వీరిద్దరికి మధ్య ఎలా డీల్ కుదిరిందో అని అనుకున్నాడట. అసలు ఒక్క రాజమౌళికే కాదు చాలామందికి ఈ డౌట్ వచ్చింది. ఇక బాలకృష్ణ 'గౌతమిపుత్ర...'ని క్రిష్ డైరెక్టన్ లో చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక సినిమా చూసిన తర్వాత రాజమౌళి ఈ సినిమా చాలాబాగా తీసారని బాలకృష్ణ కూడా బాగా నటించారని ట్వీట్ చేసాడు.
ఇక తాజాగా రాజమౌళి, క్రిష్ ని ఇంటర్వ్యూ కూడా చేసాడు. అందులోని కొన్ని మాటలు మచ్చుకి.....అసలు మీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే నేను నమ్మలేదు. ఇద్దరికీ వర్క్అవుట్ అయ్యింది అన్నా నమ్మాలనిపించలేదు....అసలు వీళ్ళిద్దరిది చాలా బ్యాడ్ కాంబినేషన్ అని నేను ఫీలయ్యాను అంటూ మొదలు పెట్టిన రాజమౌళి.... మీకసలు ఈ సినిమా తియ్యాలని ఎందుకనిపించింది అని క్రిష్ ని అడగగా క్రిష్ అది నాకొక ఫ్యాషన్ ఎందుకో తియ్యాలని డిసైడ్ అయ్యా తీసేసా.. అని చెప్పాడు.
అసలు 79 రోజుల్లో 'గౌతమి పుత్ర శాతకర్ణి' చిత్రాన్ని ఎలా తెరకెక్కించారని రాజమౌళి అడగా... క్రిష్ రోజుకి 14 గంటలు వ్యయ ప్రయాసలు పడి ఈ సినిమా పూర్తి చేశామని చెప్పారు. ఈ క్రెడిట్ అంతా బాలకృష్ణ గారిదే అని క్రిష్ చెప్పారు. కేవలం సంక్రాంతికే విడుదల చెయ్యాలని టైమ్ సెట్ చెయ్యడం వల్ల ఈ సినిమాని త్వరగా చేసెయ్యగలిగామని చెప్పారు. ఇక నీకు మాస్ రాదు మాస్ రాదు అన్న మాటలకూ నేను చాలా చిరాకు పడే వాడిని. అలాంటిది ఈ 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో బాలకృష్ణ గారితో ఇంటెర్వెర్ ముందు తొడలుకొట్టించి నాకు కూడా మాస్ టచ్ తెలుసు అని తెలిసేలా చేశానని చెప్పాడు క్రిష్. ఇక దీనికి బాలకృష్ణ గారు పూర్తి సహకారం అందించారని తెలిపాడు. అయితే ఈ సీన్ చెయ్యాలంటే చాల దరిద్రంగా అనిపించిందని కానీ చెప్పెట్టప్పుడు చాలా బాగుంటుందని నవ్వుతూ చెప్పాడు క్రిష్. ఇక ఆ తొడలు కొట్టే సీన్ థియేటర్లు లో పేలిపోయాయని రాజమౌళి కితాబునిచ్చాడు.
ఇక చివరిగా మళ్ళీ ఇలాంటి చారిత్రక నేపథ్యం వున్న చిత్రాలను తెరకెక్కిస్తారా అని రాజమౌళి, క్రిష్ ని అడుగగా ప్రస్తుతానికి నాకు అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాజెక్ట్ తియ్యాలనే కోరిక తీరిందని... మళ్ళీ అలంటి ప్రాజెక్ట్ ని 70 రోజుల్లో తియ్యాలంటే సాధ్యం కాదని.... ప్రస్తుతానికి మళ్ళీ అలాంటి సాహసం చెయ్యనని నోరుమూసుకుని వేరే కథతో సినిమా చేస్తానని ఫన్నీ సమాధానాలతో ఇంటర్వ్యూ ముగించారు. ఇక రాజమౌళి గారు తనని ఇంటర్వ్యూ చెయ్యడం తన అదృష్టమని చెప్పాడు క్రిష్.