Advertisementt

సీనియర్లు. జూనియర్లకు టార్గెట్ పెట్టారు..!

Sat 21st Jan 2017 05:12 PM
chiranjeevi,balakrishna,khaidi no 150,gpsk,mahesh babu,jr ntr,pawan kalyan,allu arjun,junior heroes,senior heroes  సీనియర్లు. జూనియర్లకు టార్గెట్ పెట్టారు..!
సీనియర్లు. జూనియర్లకు టార్గెట్ పెట్టారు..!
Advertisement
Ads by CJ

సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ జూనియర్ హీరోలకు సవాల్ విసిరి, టార్గెట్ నిర్దేశించారు. ఖైదీ 150, శాతకర్ణి సినిమాలు బాక్సాఫీస్ విజయం సాధించి, కలెక్షన్లలో రికార్డ్ నెలకొల్పుతున్నాయి. చిరంజీవి ఇప్పటికే వంద కోట్ల మైలురాయి దాటేశాడు. బాలకృష్ణ తన కెరీర్ లో కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాడు. ఈ రెండు చిత్రాల ఫలితాలు ఫిబ్రవరి నుండి విడుదలయ్యే సినిమాలకు టార్గెట్ గా మారాయి. పవన్ కల్యాణ్, మహేష్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలు ఈ టార్గెట్ చేధించే ప్రయత్నం చేయగలరా?. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు టార్గెట్ నిర్దేశిస్తే, ఆ తర్వాత బ్యాటింగ్ చేసే జట్టు టార్గెట్ ను దాటితేనే గెలిచినట్టు. క్రికెట్ ఆటలో జరిగేది ఇదే. తొలుత బ్యాటింగ్ చేసిన చిరంజీవి, బాలకృష్ణ టార్గెట్ ఇచ్చేశారు. జూనియర్స్ లక్ష్యాన్ని చేదించాలి.

సీనియర్లను లక్ష్యంగా చేసుకుంటేనే జూనియర్లు గెలుస్తారు. ముఖ్యంగా చిరంజీవి నెలకొల్పిన రికార్డు సామాన్యమైనది కాదు. కేవలం ఆరు రోజుల్లోనే వంద కోట్లు సాధించేశారు. శాతకర్ణి సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అని నిర్మాతలు చెబుతున్నారు.  ఈ రెండు టార్గెట్లను కుర్రాళ్ళు ఏ మేరకు చేరుకుంటారో చూడాలి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ