Advertisementt

మరోసారి బాబీ డమ్మీ డైరెక్టరేనా...?

Sat 21st Jan 2017 02:21 PM
director bobby,sardaar gabbar singh,jr ntr,jai lava kusa,dummy director  మరోసారి బాబీ డమ్మీ డైరెక్టరేనా...?
మరోసారి బాబీ డమ్మీ డైరెక్టరేనా...?
Advertisement
Ads by CJ

బాబీ, రవితేజకు పవర్ వంటి హిట్ ఇచ్చాడు. ఇక బాబీ పేరు పెద్దగా మార్మోగలేదుగాని.. పవన్ కళ్యాణ్ పిలిచి 'సర్దార్ గబ్బర్ సింగ్' కి అవకాశం ఇవ్వడంతో బాబీ పేరు మార్మోగిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేస్తున్నాను అనే ఆనందం బాబీ కి త్వరలోనే తొలిగిపోయింది. ఎందుకంటే పవన్ కేవలం బాబీ ని ఒక డమ్మీ డైరెక్టర్ గా మాత్రమే తీసుకుని అన్నీ తానై 'సర్దార్.. ' చిత్రానికి వ్యవహరించాడు. తన సీన్స్ ని తానే డైరెక్ట్ చేసుకోవడం దగ్గర నుండి ఒకటేమిటి 'సర్దార్....' చిత్ర బాధ్యతలను మొత్తం పవన్ ఒక్కడే తీసుకున్నాడు. ఇక ఆ చిత్ర రిజల్ట్ అందరికి తెలిసిందే. అయితే సర్దార్ ప్లాప్  కి అందరూ బాబీ ని ఒక్కమాట కూడా అనలేదు.  కారణం పవన్ సినిమా అంతా వేలు పెట్టి కెలకడం మూలంగానే ఆ చిత్రం దారుణమైన అపజయాన్ని మూటగట్టుకుందనేది అందరూ గ్రహించారు.

అయినా బాబీ కి ఆకాశాలు రావడం పూర్తిగా తగ్గిపోయాయి. అలాంటి సమయంలో 'జనతా గ్యారేజ్' హిట్ తో గాల్లో తేలుతున్న ఎన్టీఆర్.. బాబీ ని పిలిచి డైరెక్టర్ గా పెద్ద ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ డెసిషన్ చాలా తప్పు అని అందరూ నెత్తి నోరు బాదుకున్నారు. అయినా బాబీని డైరెక్టర్ గా ఫైనల్ చేసిన ఎన్టీఆర్ కొన్ని విషయాల్లో బాబీ ని పక్కన పెట్టేసాడనే టాక్ వినబడుతోంది. ఆ చిత్రానికి సంబందించిన ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఎన్టీఆర్, అన్న కళ్యాణ్ రామ్ లే తీసుకుంటున్నారట. అదెలా అంటే బాలీవుడ్ నుంచి సినిమాటోగ్రాఫర్ ను ఈ చిత్రానికి తీసుకోవడం దగ్గరనుండి... మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ని సెలెక్ట్ చెయ్యడం వరకు అన్నీ ఎన్టీఆర్ చెప్పినట్లే జరుగుతున్నాయని అంటున్నారు. అంటే బాబీ ఈ చిత్రానికి కూడా డమ్మీ డైరెక్టర్ గానే ఉంటాడా? అని చాలామందికి అనుమానం కలుగుతుంది. కాకపోతే పవన్ లా ఎన్టీఆర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఇప్పటి వరకు ఏ చిత్రానికి వేలు గాని కాలు గాని పెట్టలేదు కాబట్టి.. చూద్దాం ఈ చిత్రంతో బాబీ పరిస్థితి ఎలా తయారవుతుందో...?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ