Advertisementt

సంక్రాంతి సక్సెస్..ఇంక వేసవికి కాచుకోండి..!

Sat 21st Jan 2017 11:49 AM
sankranthi,katamarayudu,bahubali,mahesh babu movie,summer release movies,dj  సంక్రాంతి సక్సెస్..ఇంక వేసవికి కాచుకోండి..!
సంక్రాంతి సక్సెస్..ఇంక వేసవికి కాచుకోండి..!
Advertisement
Ads by CJ

సంక్రాంతి సందడి ముగిసింది. ఇక అందరి చూపు వేసవిపైనే ఉంది. వాస్తవానికి సంక్రాంతి, దసరా వంటి ఎన్ని మంచి సీజన్లు ఉన్నా కూడా సమ్మర్‌ అనేది ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. సమ్మర్‌కు మరో మూడునెలల సమయం ఉండగానే మన స్టార్‌ హీరోల నుంచి మిడిల్‌ రేంజ్‌ హీరోల వరకు వేసవికి ఇప్పటి నుంచే కర్చీఫ్‌లు వేస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌ను మార్చి 29న ఉగాది కానుకగా పవన్‌కళ్యాణ్‌ తన 'కాటమరాయుడు'తో తెరతీస్తున్నాడు. ఏప్రిల్‌ 28న దేశవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న రాజమౌళి కళాఖండం 'బాహుబలి2' విడుదల కానుంది. ఇదే సమ్మర్‌ రేసుకు బన్నీ నటించిన 'డిజె' కూడా ముస్తాబవుతోంది. సీనియర్‌స్టార్స్‌ అయిన విక్టరీ వెంకటేష్‌ 'గురు', ఓంకార్‌ దర్శకత్వంలో కింగ్‌ నాగార్జున చేస్తున్న మరో వెరైటీ చిత్రం 'రాజుగారిగది-2'లు రానున్నాయి. ఇదే సీజన్‌లో గోపీచంద్‌-సంపత్‌ నందిల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం, మరో మెగా హీరో వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల కసితో తీస్తున్న 'మిస్టర్‌' చిత్రాలు కూడా విడుదల కానున్నాయి. ఇక ఈ వేసవికి మహేష్‌ తన మురుగదాస్‌ చిత్రంతో ఘన వీడ్కోలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే సంక్రాంతికి అద్భుతమైన ఆరంభం అందుకున్న టాలీవుడ్‌ ఇదే జోరును వేసవికి కూడా కొనసాగిస్తుందనే నమ్మకంతో అందరూ ఉన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ