'మనం' సినిమాలోలా నాగార్జున, నాగ చైతన్య కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీలో నటించనున్నారనే ఒక వార్త గత వారం రోజుల నుండి సోషల్ మీడియాలో ఒకటే హల్ చల్ చేస్తుంది. ఇక ఈ మల్టీ స్టారర్ చిత్రానికి దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత దిల్ రాజు అంటూ కూడా ప్రచారం జరుగుతున్న వేళ ఇదంతా ఒట్టి పుకారు అని కింగ్ నాగార్జున స్వయంగా కొట్టిపారేశాడు. నాగ చైతన్యతో నేను మల్టీస్టారర్ మూవీ లో నటించబోతున్నాననే వార్తలు కేవలం ఒక రూమర్ అని నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.
నాగార్జున తాజా చిత్రం 'నమో వేంకటేశాయ' విడుదలకు సిద్ధమవుతుండగా... ఆ సినిమా విడుదల తర్వాత నాగార్జున 'రాజుగారి గది 2' లో నటించనున్నాడు. అయితే తన పెద్ద కొడుకు నాగ చైతన్యతో తాను మల్టీ స్టారర్ మూవీ లో నటించే అవకాశం ఇప్పట్లో లేదని తేల్చి చెప్పేసాడు నాగార్జున.